Manchu Manoj: కత్తులు, గన్‌లతో మమ్మల్ని చంపేందుకు కుట్ర.. విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు!

మనోజ్ ఈరోజు తండ్రి మోహన్ బాబు నివాసం ముందు నిరసనకు దిగడం చర్చనీయంశమైంది. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. కత్తులు, గన్స్ తో రౌడీలు మమల్ని కొట్టడానికి వచ్చారని తెలిపారు.

New Update
manchu manoj with media

manchu manoj with media

Manchu Manoj:  మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఉదయం మంచు మనోజ్ జల్ పల్లిలోని తండ్రి మోహన్ బాబు ఇంటి బయట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో తన పెంపుడు జంతువులు, వస్తువులు ఉన్నాయని, వాటికి కోసం ఇంటికి వచ్చానని తెలిపారు. ఇది ఆస్తి గొడవ కాదని. తనకు ఆస్తి వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పానని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు కోసమే ఇందంతా.. అక్కడే గొడవ మొదలైందని తెలిపారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. కత్తులు, గన్స్ తో మాపై దాడి చేయడానికి వచ్చారు. వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులకు ఇచ్చానని  ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్.

Also Read: Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!

కార్లను ఎత్తుకెళ్లారు 

 తాను లేని సమయంలో విష్ణు అనుచరులు తన కారుతో పాటు పాపకు సంబంధించిన కొన్ని నగలు, ఇతర వస్తువులను దొంగతనం చేశారని చెప్పారు . ఈనెల 1న పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశాడని ఆరోపించారు మనోజ్. కార్లను ఎత్తుకెళ్ళడంతో పాటు తన సెక్యూరిటీ పై దాడి చేశారని తెలిపారు. దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదని అన్నారు.  ఈరోజు కోర్టు నోటీసులతో వచ్చినా..ఇంటి  లోపలికి  పంపించడం లేదని , తన సమస్యను పరిష్కరించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మనోజ్. 

గొడ్డు చాకిరీ చేశాను

మనోజ్ ఇంకా మాట్లాడుతూ.. వాళ్ళ కోసం గొడ్డు చాకిరీ చేశాను. విష్ణు కెరీర్ నిలబడడం కోసం లేడీ గెటప్ కూడా వేశాను. ఎందుకింతలా దిగజారుతున్నారో అర్థం కావడం లేదు. 'కన్నప్ప' కు పోటీగా  'భైరవం' విడుదల చేద్దామని అనుకున్నాం. దాంతో టెన్షన్ పడిపోయి తన సినిమా వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు అంటూ విష్ణు పై కీలక వ్యాఖ్యలు చేశారు.  

latest-news | cinema-news | manchu-manoj

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
తాజా కథనాలు