Manchu Manoj: తమ్ముడూ.. నీకు విలన్ గా నటిస్తా..! 'లిటిల్ హార్ట్స్' మౌళికి మనోజ్ బంపరాఫర్

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిరాయ్’ ఘన విజయం సాధించడంతో, ఆయన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమాలు చేస్తే ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 'లిటిల్ హార్ట్స్' మూవీ విజయానికి హీరో మౌళికి అభినందనలు తెలిపారు.

New Update
Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: తేజ సజ్జ(Teja Sajja) హీరోగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన తాజా చిత్రం  ‘మిరాయ్’(Mirai Movie) విజయవంతమవడంతో, మంచు మనోజ్ ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో(Mirai Success Meet) మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. 

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

మిరాయ్ సినిమాను చూసిన తర్వాత తన తల్లి ఎమోషనల్ అయిందని మనోజ్ చెప్పారు. ‘‘మా అమ్మ నన్ను హత్తుకొని ప్రేమగా నా కళ్ళలోకి చూసింది. 'నువ్వు మిరాయ్‌లో మహావీర్ లామా పాత్రను అద్భుతంగా చేశావు’ అని చెప్పడం నా జీవితంలో గొప్ప క్షణం. అలాగే మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం’’ అని అన్నారు.

అభిమానుల ప్రేమే నా విజయానికి కారణం

‘‘నా విజయం కోసం ఎదురు చూసే అభిమానులు నాకు ఉన్నారు. వారి ప్రేమకు నేను కృతజ్ఞతలు చెప్పలేను. మీ ప్రేమకి తగ్గట్టుగా నేను పని చేస్తాను. మీరందరూ నాకు కుటుంబంలా అయ్యారు’’ అని మనోజ్ ఎమోషనల్‌గా తెలిపారు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

ఇండస్ట్రీలో విజయం ఎవరికైనా సాధ్యం: మనోజ్

‘‘ఇప్పుడు థియేటర్లకు జనాలు రావడం లేదు అంటున్నారు. కానీ 'మిరాయ్‌' సినిమాతో నిరూపించాం మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇండస్ట్రీలో విశ్వప్రసాద్ గారిలాంటి నిర్మాతలు అరుదుగా ఉంటారు. వారు క్వాలిటీకి రాజీ పడరు. రాబోయే 'రాజా సాబ్' సినిమాతో రికార్డులు తిరగరాయబోతున్నాం’’ అన్నారు.

'లిటిల్ హార్ట్స్' మౌళి కోసం విలన్ పాత్ర (Manchu Manoj About Little Hearts Mouli)

‘‘90s కిడ్స్ తర్వాత, యూట్యూబర్ మౌళి నటించిన 'లిటిల్ హార్ట్స్' బ్లాక్‌బస్టర్ అయ్యింది. మౌళి తన టాలెంట్‌తో ఎవరైనా హీరో అవ్వొచ్చని చూపించాడు. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్ద హీరోల కొడుకులే హీరో కావాల్సిన అవసరం లేదు. మౌళీకి మాటిస్తున్నా, నీ సినిమాలో విలన్ పాత్ర ఉన్నా నన్ను ఫిక్స్ చేయి’’ అని మనోజ్ ఆసక్తికరంగా అన్నారు.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

ఈ మధ్యకాలంలో రిలీజైన సినిమాలపై మాట్లాడుతూ.. ‘‘మిరాయ్, 'కిష్కింధపురి' ఒకేసారి రిలీజ్ అయి రెండు హిట్స్ అయ్యాయి. ఇది తెలుగు ఇండస్ట్రీకి గొప్ప సిగ్నల్. మా అక్క లక్ష్మీ మాంచు నటించిన ‘దక్ష’ త్వరలో రాబోతోంది. అలాగే, ఈ నెలలో రాబోయే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' సినిమా సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది’’ అని చెప్పారు.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..

తాను త్వరలో దర్శకుడు డేవిడ్ రెడ్డితో కలిసి ఒక భారీ యాక్షన్ కథపై పనిచేస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ఇది బ్రిటిష్ కాలంలో జరిగే కథ అని చెప్పారు. అంతేకాకుండా, 'అబ్రహం లింకన్', 'రక్షక్' సినిమాలు కూడా ప్రాజెక్ట్ లైనప్‌లో ఉన్నాయని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు