Manchu Lakshmi: దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ భైరవం సినిమాతో మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. అయితే ఈరోజు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అక్క మంచు లక్ష్మీ మూవీని ప్రమోట్ చేస్తూ తమ్ముడికి స్పెషల్ విషెష్ తెలియజేసింది. ఇటీవలే భైరవం నుంచి విడుదలైన ''డమ్ డమారే'' పాటకు కూతురితో కలిసి రీల్ చేసింది. ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మనోజ్ కి బర్త్ డే విషెష్ తెలియజేసింది. ''డామ్ డామరే పుట్టినరోజు మను.. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది❤️❤️
ఇంకా ముందుకు, ఎత్తుకు వెళ్తావు నాన్న.. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాను'' అంటూ పోస్ట్ పెట్టారు.
Have a Dam damarey birthday Manu
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 20, 2025
All your hard work is paying off ❤️❤️
Onward and upward nana
Love you 🥰 #HBDManchuManoj #lakshmimanchu#dumdumaare #Bhairavam pic.twitter.com/vOcJcnrEZO
మాస్ స్టెప్పులతో
డుమ్.. డుమారే అంటూ సంక్రాంతి పండగ నేపథ్యంలో సందడిగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ స్టెప్పులతో అలరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతంలో భాస్కర్ భట్ల ఈ పాటకు సంగీతం అందించారు. విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న విడుదల కానుంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలుసూపర్ బజ్ క్రియేట్ చేశాయి. మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి మధ్య స్నేహం, భావోద్వేగం, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది.
telugu-news | latest-news | cinema-news | Bhairavam songs | Manchu Manoj
Also Read: JVAS Re Release: మానవా.. కొత్తగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ ట్రైలర్.! భలే ఉంది