Dhanush - Mrunal Thakur: మృణాల్‌‌తో ధనుష్‌ డేటింగ్.. ఈ వీడియోతో మొత్తం బయటపడింది..!

కోలీవుడ్ నటుడు ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడం, ఒకరి పట్ల ఒకరు చూపించే సన్నిహిత సంబంధం దీనికి ప్రధాన కారణం. ఈ వార్తలపై ధనుష్ కానీ, మృణాల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

New Update
Dhanush And Actress Mrunal Thakur Dating News viral

Dhanush And Actress Mrunal Thakur Dating News viral

కోలీవుడ్ నటుడు ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేసుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీరిద్దరూ తరచుగా కలిసి కెమెరాలకు చిక్కడం, ఒకరి పట్ల ఒకరు చూపించే సన్నిహిత సంబంధం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై నటుడు ధనుష్ కానీ, నటి మృణాల్ ఠాకూర్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Dhanush And Actress Mrunal Thakur

ఇదిలా ఉంటే గతంలో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌తో విడాకుల తర్వాత ధనుష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపైనే వార్తల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవలే ధనుష్‌కు సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఆయన సీనియర్ నటి మీనాను పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఈ వార్తలను మీనా ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇలాంటి ప్రచారం తనను, తన కూతురిని చాలా బాధపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో తాజాగా ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేసుకుంటున్నారంటూ వార్తలు వైరల్‌గా మారాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ గాసిప్స్‌కు ఓ ప్రధాన కారణం ఉంది. ఇటీవల మృణాల్ ఠాకూర్ బర్త్ డే అయింది. ఆ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ పాల్గొనడం ఒకెత్తయితే.. అందులో వారిద్దరూ చాలా సన్నిహితంగా కనిపించడం, చేతులు పట్టుకోవడం వంటివి చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అక్కడ నుంచి వీరి ఇద్దరి మధ్య డేటింగ్ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

అంతేకాకుండా ఇటీవల మృణాల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. ఈ సినిమా ప్రీమియర్ షోకి ధనుష్ హాజరుకావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇదిలా ఉంటే.. ధనుష్, మృణాల్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమా రాబోతుంది. ఇందులో ధనుష్ నటిస్తుండగా.. మృణాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. 

ఈ మూవీ చిత్రీకరణ టైంలోనే ధనుష్, మృణాల్ మధ్య పరిచయం పెరిగిందని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఆ పరిచయం కాస్త.. డేటింగ్ వరకు వెళ్లి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన స్పాటిఫై ప్లేలిస్ట్‌లో ‘‘మామాస్ ఫేవ్స్’’ అనే పేరుతో ధనుష్ సిఫార్సు చేసిన తమిళ సాంగ్స్ కూడా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈ విషయంపై ధనుష్ లేదా మృణాల్ అధికారిక ప్రకటన చేస్తే కానీ అసలు నిజం బయటపడేలా లేదు. 

Advertisment
తాజా కథనాలు