Rini Ann George : హోటల్కు రమ్మన్నాడు.. నటి సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ లీడర్ రిజైన్!

కేరళకు చెందిన ఒక యువ రాజకీయ నాయకుడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ కీలక కామెంట్స్ చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజులు పెట్టి హోటల్ కు రావాలంటూ వేధించాడని అరోపించింది.

New Update
kerala

కేరళకు చెందిన ఒక యువ రాజకీయ నాయకుడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ కీలక కామెంట్స్ చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజులు పెట్టి హోటల్ కు రావాలంటూ వేధించాడని ఆమె అరోపించింది. గత మూడేళ్లుగా అతని నుంచివేధింపులు ఎదురుకుంటున్నానని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తనపై ఎలాంటి దాడి జరగలేదని, కానీ అనేక మంది వేధింపులకు గురయ్యారని తెలిసిందని, తాను వారి తరుపున మాట్లాడుతున్నానని రిని ఆన్ జార్జ్ తెలిపారు. 

Also read :  Acid Attack on Husband: బైక్‌పై వెళ్తుండగా మొగుడిపై యాసిడ్ పోసిన భార్య..

నటి రిని ఆన్ జార్జ్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు కేరళ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి.  ఆ రాజకీయ నాయకుడి పేరు ఆమె చెప్పనప్పటికీ, బీజేపీ కార్యకర్తలు పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్‌పై ఆరోపణలు చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో ఈ విషయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాహుల్ మమ్కూటతిల్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.అయితే రిని ఆన్ జార్జ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

Also Read :  Online Gaming Ban Bill: కేంద్రం సంచలన బిల్లు.. రూ. 2లక్షల ఉద్యోగాలు ఔట్!

నమ్మకం లేకపోవడం వల్లే

భద్రతా కారణాల వల్ల, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం లేకపోవడం వల్లే తాను ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపారు. ఆమె ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడిన తర్వాత, మరికొంతమంది మహిళలు కూడా ఇదే నాయకుడి నుండి ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని ఆమెకు తెలియజేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, ఆమెకు సైబర్ దాడులు కూడా ఎదురవుతున్నాయని ఆమె వెల్లడించారు. 

Also Read :  Son Killed Mother : వీడో కసాయి కొడుకు..బీమా డబ్బుల కోసం కన్నతల్లినే..

ఈ వేధింపులు కొనసాగితే ఆ నాయకుడి పేరును ఖచ్చితంగా బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కాగా రిని ఆన్ జార్జ్ ఒక మలయాళ నటి. ఆమె ఒకప్పుడు జర్నలిస్టుగా కూడా పనిచేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ ఏడాది రిలీజైన  '916 కుంజూట్టన్' అనే మలయాళ చిత్రంలో ఆమె నటించారు. 

Also Read : Actress Samantha: అందుకే సినిమాలు చేయట్లేదు.. మొత్తానికి నోరు విప్పిన సామ్!

Advertisment
తాజా కథనాలు