Actress Samantha: అందుకే సినిమాలు చేయట్లేదు.. మొత్తానికి నోరు విప్పిన సామ్!

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను సినిమాల్లో తక్కువగా కనిపించడానికి గల కారణాలను కూడా వివరించింది. 

New Update
Samantha

Samantha

Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.  తరచూ లేటెస్ట్ ఫ్యాషన్  ఫొటో షూట్లు, ఫిట్ నెస్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది సామ్. అయినప్పటికీ సామ్ సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంపై  రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉండే సామ్ కి..  ఇప్పుడు అవకాశాలు రావట్లేదా? అని అనుకుంటున్నారు నెటిజన్లు. 

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్  ‘గ్రాజియా ఇండియా’ కిఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో  తాను సినిమాల్లో తక్కువగా కనిపించడానికి గల కారణాలను కూడా వివరించింది.  ‘గ్రాజియా ఇండియా’ ఇటీవలే సామ్ ఫొటోను తమ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై ప్రింట్ చేసింది. ఈ సందర్భంగానే ఆమెతో ఇంటర్వ్యూ తీసుకుంది. 

ఇంటర్వ్యూలో  సామ్ మాట్లాడుతూ.. కెరీర్ లో ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే ఎంత మంచి చిత్రాలు చేశామనేదే ముఖ్యమని తెలిపింది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. గతంతో పోలిస్తే.. ఇప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. ఎన్నో మంచి  పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు  ఫిట్ నెస్, సినిమాలు రెండిపైనా దృష్టి సారించాను. మంచి కథలు, సినిమాలు, సీరీస్ లలో భాగమయ్యను. నేను చేసే చిత్రాలన్నీ కేవలం ఫ్యాషన్ కోసమో, గుర్తింపు కోసమో చేస్తున్నవి కాదు! అవన్నీ కూడా నా మనసుకు దగ్గరైన కథలు అని వివరించింది సామ్. 

అందుకే సినిమాలు తగ్గించా.. 

అలాగే  శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ''ఇక నుంచి ఒకేసారి నాలుగు, ఐదు ప్రాజెక్టులు చేయనని, తన  శరీరం చెపింది మాత్రమే వింటానని చెప్పుకొచ్చింది.  తక్కువ ప్రాజెక్టులు చేసినప్పటికీ.. ప్రేక్షకుల మనసుకు నచ్చే వాటితోనే ముందుకొస్తానని తెలిపింది.  సినిమాల సంఖ్య తగ్గినా.. వాటి నాణ్యత మాత్రం పెరుగుతుంది'' అని చెప్పింది సామ్. 

నటిగానే కాకుండా  నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల బ్యానర్ ద్వారా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇటీవలే సామ్ నిర్మించిన  'శుభం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మహిళల్లో సీరియల్ అడిక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే అంశానికి హారర్ ఎలిమెంట్స్ జోడించి ఎంతో ఆసక్తికరంగా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రూపొందించారు.  

సామ్ చివరిగా  2023లో 'ఖుషీ' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రీసెంట్ సిటాడెల్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ లో 'మా ఇంటి బంగారం', 'రంగమార్తాండ' సినిమాలు చేస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ  ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు.

Also Read:  Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!

Advertisment
తాజా కథనాలు