Acid Attack on Husband: బైక్‌పై వెళ్తుండగా మొగుడిపై యాసిడ్ పోసిన భార్య..

త్రిపురలో భర్తపై భార్య యాసిడ్ దాడికి పాల్పడింది. భర్త బైక్‌పై ఆమెను తీసుకెళ్తుండగా ముఖం, మెడపై యాసిడ్ పోసింది. గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గృహహింస కారణంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అనుమానం. ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది.

New Update
Acid Attack on Husband

Acid Attack on Husband

Acid Attack on Husband: త్రిపుర రాష్ట్రంలోని పశ్చిమ త్రిపుర(Tripura) జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఓ మహిళ తన భర్తపై యాసిడ్ దాడికి పాల్పడి అందరిని షాక్‌కు గురి చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బైక్‌పై వెళ్తుండగా దాడి..

వివరాల్లోకి వెళ్తే, శిబాజీ దేబ్‌బర్మా అనే రైతు తన భార్య సుమిత్రా దేబ్‌బర్మాతో కలిసి బుధవారం రోజున బైక్‌పై చాంద్‌పూర్ వైపు వెళ్తున్నారు. ఇద్దరూ బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో, సుమిత్రా ఒక్కసారిగా తన చేతిలో ఉన్న యాసిడ్ భర్త ముఖం, మెడపై పోసింది. ప్రమాదంలో గాయపడిన శిబాజీ వెంటనే బైక్ ఆపి కిందికి దిగి ఒక్కసారిగా ఏమైందో అర్థంకాక బాధతో గట్టిగా అరిచాడు.

Also Read: 'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్​లో చుక్కలు చూపించిన భర్త..!

పక్కనే ఉన్న గ్రామస్తులు అరుపులు విని అక్కడికి పరుగెత్తారు. వారిని చూసిన సుమిత్రా మళ్లీ యాసిడ్ పోసేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రజలు అప్రమత్తమై వెంటనే ఆమెను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం గాయాలతో బాధపడుతున్న శిబాజీని వెంటనే జీబీపీ (GBP) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఈ ఘటనపై సిద్ధాయి పోలీస్ స్టేషన్ అధికారి హిమాద్రి సర్కార్ మాట్లాడుతూ  "ఇది అంత చూస్తుంటే, ఆ మహిళ గతంలో గృహ హింసకు గురై ఉండొచ్చు. అది ఆమెను ఇటువంటి దాడికి పాల్పడేలా చేసి ఉండొచ్చని భావిస్తున్నాం" అన్నారు. అయితే ఇప్పటి వరకు బాధితుడు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు. శిబాజీ చికిత్సలో ఉండడంతో అధికారికంగా కేసు ఇంకా రిజిస్టర్ కాలేదని చెప్పారు.

మరోవైపు, యాసిడ్ దాడి తర్వాత సుమిత్రా అక్కడి నుంచి పరారయింది. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థుల సమాచారం ప్రకారం, వీరి మధ్య గతంలో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. గృహహింస కారణంగా ఈ దాడి జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. 

Advertisment
తాజా కథనాలు