Mahesh babu: తండ్రిని మించిన తనయుడు.. యాక్టింగ్‌లో ఇరగదీసిన గౌతమ్!

మహేశ్‌బాబు కొడుకు గౌతమ్‌ యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు. అమెరికాలో నటన శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ తాజాగా ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ షార్ట్ ఫిలింలో నటించి ఔరా అనిపించాడు. చిరునవ్వు, కోపం ప్రదర్శించిన వీడియో వైరల్ అవుతుండగా ప్రిన్స్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

New Update
mahesh gautam

Mahesh Babu son Gautham acting video goes viral

Mahesh babu: టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు కొడుకు గౌతమ్‌ యాక్టింగ్‌లో అదరగొడుతున్నాడు. అమెరికాలో ఉంటోన్న గౌతమ్ న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో నటన శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తోటి విద్యార్థితో కలిసి ఒక స్కిట్‌లో పాల్గొని తండ్రికి తగ్గ తనయ అనిపించేలా నటించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు. 

‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా..

ఇక  వీడియో  విషయానికొస్తే.. సీన్ మొదట్లో చిరునవ్వుతో కూల్ గా కనిపించిన గౌతమ్‌.. ఆ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహానికి గురయ్యాడు. కోపంలో సంభాషణలు చెబుతూ కనిపించి ఔరా అనిపించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన నిర్వాహకులు..  ‘గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతం. ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను బయటకు తీసేందుకు నిర్వహించిన ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది’ అంటూ గౌతమ్ పై ప్రశంసలు కురిపించారు. 

Also Read: మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

ఇదిలా ఉంటే.. మహేశ్‌ ‘1 నేన్కొక్కడినే’సినిమాతో  గౌతమ్‌ బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. మహేశ్‌ కూతురు సితార కూడా వరుస యాడ్స్, తదితర వేడుకల్లో పాల్గొంటూ అలరిస్తోంది. ఇక రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న #SSMB19 షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతోంది. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

 mahesh-babu | son | america | telugu-news | today telugu news | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు