Guntur Kaaram Movie: రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?

ఐఫా వేడుకల్లో దగ్గుబాటి రానా, తేజ సజ్జా కలిసి హోస్ట్ చేశారు. వేదికపై ఓ సందర్భంలో 'గుంటూరు కారం' మూవీ టాపిక్ వచ్చింది. దీంతో రానా, తేజ ఇద్దరూ మహేష్ బాబుపై సెటైర్స్ వేశారు. అది ఇప్పుడు ఫ్యాన్స్ నచ్చడం లేదు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
sdgd

రీసెంట్ గా దుబాయ్ లో ఐఫా అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు నుంచి దగ్గుబాటి రానా, తేజ సజ్జా కలిసి హోస్ట్ చేశారు. వేదికపై అందర్నీ నవ్వించేందుకు ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతర హీరోలపై కూడా కామెంట్స్ చేశారు. అందులో మహేష్ బాబు పేరు కూడా ఉంది. ఈ ఈవెంట్ లో తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. 

మహేష్ బాబుపై సెటైర్లు..

అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్‌ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు. 

Also Read : స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ పై లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్..!

అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్‌ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' సినిమాపై విమర్శలు వస్తే, 'తేజ సజ్జా 'హనుమాన్' మూవీకి ప్రసంశలు దక్కాయి. 

Aslo Read: ఇచ్చిన మాట ప్రకారం పవన్ అడుగులు.. పిఠాపురంలో మరో 12ఎకరాలు

ఫ్యాన్స్ సీరియస్..

అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే రానా, తేజ ఇద్దరూ కలిసి మహేష్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇది కాస్త నెట్టింట వివాదంగా మారింది.

Also Read : ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' తెలుగు రీమేక్ లో నటించనున్న స్టార్ హీరో!?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు