ఇచ్చిన మాట ప్రకారం పవన్ అడుగులు.. పిఠాపురంలో మరో 12ఎకరాలు ప్రజాసేవ చేసేందుకు నియోజకవర్గంలో నివాసం ఉంటానని హామీ ఇచ్చిన పవన్.. మాట ప్రకారం అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం అక్కడే మరో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. By Archana 06 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update pawan kalyan షేర్ చేయండి Pawan kalyan: ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రజాసేవ చేసేందుకు నియోజకవర్గంలో నివాసం ఉంటానని, అక్కడే ఇల్లు కట్టుకుంటానని మాటిచ్చారు. అదే మాట ప్రకారం పవన్ అడుగులు వేస్తున్నారు. గతంలో తన నివాసం కోసం ఇల్లింద్రాడ, భోగాపురంలో వరుసగా 2.08, 1.44 ఎకరాలు కొనుగోలు చేసిన పవన్.. తాజాగా మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు. Also Read: బాలీవుడ్ 'రామాయణం' పై అదిరిపోయే అప్డేట్.. 2 పార్టులుగా..పోస్టర్ వైరల్ మరో 12 ఎకరాలు సోమవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ గతంలో స్థలాన్ని కొనుగోలు చేసిన ఇల్లింద్రాడ, భోగాపురం ప్రాంతంలో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో పవన్ తన ఇల్లు, క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే పవన్ ఏపీ మాజీ సీఎం జగన్ కు సంబంధించిన సరస్వతి పవర్ పై సంచలన కామెంట్స్ చేశారు. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలో సరస్వతి పవర్ భూములను ఆయన పరీశీలించిన అనంతరం మాట్లాడుతూ.. యాజమాన్యం 1384 ఎకరాల భూముని కొన్నట్లు చెప్పారు. అందులో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. బాంబులేసి భయపెట్టి రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే పేట్రేగి పోతారన్నారు. రైతులకు అండగా ఉండటానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఇక్కడికి ఫ్యాక్టరీ రాలేదు కానీ.. అన్నాచెల్లెళ్లు కొట్టుకున్నారన్నారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి తీసేసుకున్నారన్నారు. మరి ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్ Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి