ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' తెలుగు రీమేక్ లో నటించనున్న స్టార్ హీరో!? ఫహాద్ ఫాజిల్ మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆవేశం' తెలుగులో రిమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో మాస్ మహారాజా రవితేజ నటించనున్నట్లు సమాచారం. స్వయంగా రవితేజ ఈ మూవీ రీమేక్ రైట్స్ ను కొన్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. By Anil Kumar 06 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఫహాద్ ఫాజిల్ ఈ ఏడాది మలయాళంలో నటించిన 'ఆవేశం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఓ రౌడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఓ వైపు విలక్షణ నటనతో మరోవైపు అదిరిపోయే కామెడీ పండించి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఫహాద్ కు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని ఇతర భాషల ఆడియన్స్ సైతం థియేటర్స్ లో సబ్ టైటిల్స్ తో మరీ చూశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఈ ఇయర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈ మూవీ తెలుగులో రీమేక్ కాబోతుంది. అందుకే 'ఆవేశం' డబ్బింగ్ వెర్షన్ ను ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. 'ఆవేశం' తెలుగు రీమేక్ లో మొదటగా బాలయ్య పేరు వినిపించింది. Also Read : అమెరికా ఎన్నికల్లో 'జై బాలయ్య'.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్ రవితేజ హీరోగా.. ఆ తరువాత విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ పేర్లు సైతం బయటికొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లో నటించేది వీళ్ళెవ్వరూ కాదు. ఆ ఛాన్స్ మన మాస్ మహారాజా రవితేజకు దక్కిందట. స్వయంగా రవితేజ ఈ మూవీ రీమేక్ రైట్స్ ను కొన్నట్లు వఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఫహద్ ఫాసిల్ పోషించిన రంగస్థలం పాత్రలో రవితేజ నటించనుండగా, కథలో కూడా కొన్ని మార్పులు కూడా చేశారని తెలుస్తోంది. అయితే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించి చాలా కాలమే అవుతుంది. ఈ ఆమధ్య ఆయన సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు. 'ఆవేశం' లాంటి యాక్షన్ అండ్ కామెడీ మూవీలో నటిస్తే హిట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. Also Read : యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ కు ప్రభాస్ ఓపెన్ ఆఫర్.. మీ దగ్గర మంచి కథ ఉందా? #aavesham-movie #raviteja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి