/rtv/media/media_files/2025/09/10/little-hearts-2025-09-10-19-33-46.jpg)
Little Hearts
Little Hearts: సాయిమార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మౌళి తనూజ్(Mouli Talks), శివానీ నాగారం లీడ్ రోల్స్‌లో నటించగా, ETV Win బ్యానర్‌పై ఆదిత్య హసన్(Aditya Haasan) నిర్మించారు. ఇది ఈటీవీ విన్ నుంచి వచ్చిన మొట్టమొదటి థియేట్రికల్ సినిమా కావడం విశేషం. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణం కేవలం మౌళినే, తన కోసం జనాలు థియేటర్లకు వస్తున్నారు. నిర్మాతగా నన్ను సక్సెస్ చేసిన మౌళికి థాంక్ యు.. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇప్పటికే ఈ మూవీకి ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Producer #AdityaHasan is delighted with the huge success of #LittleHearts ❤️
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) September 10, 2025
Stars #AnandDeverakonda and @iamvaishnavi04 also joined to congratulated the whole team! pic.twitter.com/OPbo2oSkUr
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
కథలోకి వెళ్తే...
అఖిల్ అనే యువకుడి పాత్రలో మౌళి తనూజ్ కనిపిస్తాడు. చదువుల్లో అంతగా ఆకట్టుకోని అతడు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించలేక, నాన్న చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ కోచింగ్‌కి వెళతాడు. అక్కడే కాత్యాయనీ (శివానీ నాగారం) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ మొదట స్నేహితులుగా ప్రారంభమై, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది.
అయితే, అఖిల్ తన ప్రేమను వ్యక్తం చేసిన తర్వాత కాత్యాయనీ ఓ విషయాన్నీ చెప్పి అఖిల్ ను షాక్ కి గురి చేస్తుంది. అదే ఈ ప్రేమకథకి పెద్ద మలుపు. ఈ విషయం ఏమిటి? ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగిందా? లేదా అనేది సినిమా మిగిలిన భాగం.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ఫుల్ ఫన్ రైడ్..
సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా యూత్‌ఫుల్ కామెడీతో నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో కూడా పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా హీరో - హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమా ప్రపోజల్స్, సర్‌ప్రైజులు, ఇంట్లో జరిగే ఫన్నీ సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తూ, కథలో లీనమైపోయేలా చేస్తాయి.
కాత్యాయనీ... బోంచేసావా..?
‘కాత్యాయనీ పాట’ కథకు బలాన్నిచ్చింది. ఆ పాటలో చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో కొత్త ఫీల్‌ను కలిగిస్తాయి. హీరో తమ్ముడు చేసే కామెడీ ట్రాక్, ఇంట్లో సన్నివేశాలు, బాహుబలి సినిమా ఫలితాన్ని ప్రేమకథతో కలిపి చూపిన తీరు చాలా కొత్తగా ఉంది.
Also Read: జోడీ అదిరిందిగా..! దుల్కర్ తో పొడుగు కాళ్ళ సుందరి
"90's మిడిల్ క్లాస్ బయోపిక్"తో గుర్తింపు పొందిన మౌళి తనూజ్ ఈ సినిమాతో మరోసారి తన నాచురల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. శివానీ నాగారం కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. దర్శకుడు సాయిమార్తాండ్ హాస్యాన్ని బాగా పండించాడు.
"లిటిల్ హార్ట్స్" సినిమా ఓ మంచి లవ్ & కామెడీ డ్రామా. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. హాస్యం, మంచి కథ, మంచి సందేశం అన్నీ కలిపి ఇది ఒక హార్ట్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది.