/rtv/media/media_files/2025/09/10/pooja-hegde-dq41-2025-09-10-19-00-32.jpg)
Pooja Hegde DQ41
Pooja Hegde DQ41: తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తాజాగా తన 41వ సినిమాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ను కొత్త దర్శకుడు రవి నేలకుదిటి తెరకెక్కిస్తుండగా, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా #DQ41 అనే పేరు పెట్టారు.
తాజాగా విడుదల చేసిన స్పెషల్ వీడియోతో ఈ సినిమాకు గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా ఎంపికయ్యినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ జంటను బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గ్రాండ్‌గా స్టార్ట్ అయిన "#DQ41"
ఈ సినిమాకు హైదరాబాద్‌లో పెద్ద పూజా కార్యక్రమం నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఇది SLV సినిమాస్ బ్యానర్‌లో రూపొందుతున్న 10వ సినిమా కావడం విశేషం.
పూజా హెగ్డే - మరోసారి లీడ్ రోల్‌లో
పూజా హెగ్డే గతంలో చేసిన సినిమా ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయినా, ‘కూలీ’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ "మోనికా"తో అభిమానులను మెప్పించింది. ఇప్పుడు దుల్కర్‌తో జతకట్టడం ఆమెకు మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్..
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా జివి ప్రకాష్ కుమార్ పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ అనయ్ ఓం గోస్వామి చేస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. ఈ కాంబినేషన్ చూస్తే, విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
ఇటీవలే దుల్కర్ సల్మాన్ నిర్మించిన ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ విజయం తర్వాత దుల్కర్ నటుడిగా మళ్లీ సెట్‌కి వచ్చారు. తాజా సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ బజ్ స్టార్ట్ అయింది.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
మొత్తానికి దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న #DQ41 సినిమా మొదలైనప్పటి నుంచి మంచి హైప్ దక్కించుకుంటోంది. కొత్త దర్శకుడు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. త్వరలో షూటింగ్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఈ కాంబినేషన్‌కి మంచి హిట్ వస్తుందేమో చూడాలి.