Shrasti Verma in Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ.. ఈసారి మాములుగా ఉండదుగా!

జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్‌ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ చెందింది. గతేడాది విడుదలైన పుష్ప 2లో కొన్ని సాంగ్స్‌కు కూడా ఈమె కొరియోగ్రఫీ చేసింది.

New Update
Shrasti Verma in Bigg Boss 9

Shrasti Verma in Bigg Boss 9

Shrasti Verma in Bigg Boss 9: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈ సారి మరింత కొత్తగా రానుంది. ప్రతీ సీజన్‌లో కొన్ని మార్పులు, డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది.  అలాగే ఈ సీజన్‌లో కూడా కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చారు. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. వీరిలో యాంకర్లు, డ్యాన్సర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇలా ఉంటారు. అయితే ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్షను ప్రారంభించింది. కొంతమంది సామాన్యులను సెలక్ట్ చేసి అందులో ఎవరైతే టాస్క్‌లు ఆడి గెలుస్తారో వారికి బిగ్ బాస్‌లోకి అవకాశం ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..

ఢీ డ్యాన్స్ షో ద్వారా..

ఈ బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుందంటే.. పలు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తాయి. అయితే లేడీ కొరియోగ్రాఫర్(Dance Choreographer) శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్ని రోజులు వర్క్ చేసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా శ్రష్ఠి రాణిస్తోంది. వరుస సినిమా సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేస్తూ రోజు రోజుకీ బిజీగా మారుతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2(pushpa-2)లో కొన్ని సాంగ్స్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసి తన సత్తా ఏంటో చాటుకుంది. అయితే ఈమె బిగ్ బాస్‌లోకి వెళ్తుందా? లేదా? అనేది క్లారిటీగా తెలియాలంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: హీరో విజయ్ దళపతిపై కేసు నమోదు

ఇదిలా ఉండగా బిగ్ బాస్‌ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లు కంప్లీట్ కాగా బిగ్ బాస్ 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే  మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా చేశారు. మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ 9వ సీజన్‌కు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా బిగ్ బాస్ టీం విడుదల చేసింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. 

Advertisment
తాజా కథనాలు