మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న 'ఉప్పెన' బ్యూటీ.. ఈసారి మాస్ హీరోతో

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హీరోయిన్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

New Update
ktri

'ఉప్పెన' మూవీతో టాలీవుడ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి శెట్టి.. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే గత కొంతకాలంగా ఈ హీరోయిన్ నటించిన సినిమాలు నిరాశ పరచడంతో తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. సుమారు ఏడాది పాటూ టాలీవుడ్ కు దూరంగా ఉన్న కృతి శెట్టి.. రీసెంట్ గా శర్వానంగ్ తో కలిసి 'మనమే' అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది.

Also Read : ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

మాస్ కా దాస్ కి జోడిగా..

ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా కృతి శెట్టికి మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రెజెంట్ కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో టాలీవుడ్ ఆఫర్ పట్టేసింది. ఈసారి మాస్ హీరోతో రొమాన్స్ చేయనుంది. 'జాతిరత్నాలు' ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. 

Also Read : 'గేమ్ ఛేంజర్' డ్యూయెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

వీఎస్‌ 14’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కృతి శెట్టితో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

Also Read : చంపేస్తామని బెదిరింపులు.. ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ ఏం చేశాడో తెలుసా?

రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఉండబోతుంది. మరి ఈ సినిమాతోనైనా కృతి శెట్టి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ - కృతి శెట్టి కలిసి ఫస్ట్ టైం నటించబోతున్నారు. ఇక విశ్వక్ సేన్ ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు.న్నాడు. ఇప్పటికే 'మెకానికా రాకీ' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. 

Also Read : కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో

Advertisment
Advertisment
తాజా కథనాలు