/rtv/media/media_files/2024/10/19/BFOODlxRdapDBE3GxpBk.jpg)
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు సందేశం వచ్చింది.
ఒక వేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సల్మాన్ కు ప్రాణభయం పట్టుకుంది. ఈ మేరకు తన సేఫ్టీ కోసం ఈ హీరో బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ దగ్గర ఓ బులెట్ ప్రూఫ్ కార్ ఉంది. దాని విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుంది.
Also Read : కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో
అయితే ఈసారి మాత్రం ఎక్కువ ఫీచర్స్ ఉన్న బులెట్ ప్రూఫ్ కారును కొన్నాడు. దాన్ని ఏకంగా దుబాయ్ నుంచి తెప్పించాడు. నిస్సాన్ కంపెనీకి చెందిన ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఖరీదు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. లేటెస్ట్ మోడల్ కారులో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. అయితే ఈ కారు మన దేశంలో దొరకకపోవడంతో దాన్ని ఏకంగా దుబాయ్ తెప్పించాడట సల్లూ భాయ్.
Bollywood star hero @BeingSalmanKhan has bought a bulletproof Nissan Patrol SUV. Since the car is not available in the Indian market, the star is reportedly getting it imported from #Dubai. The car's price tag is around ₹2 crore. Salman is taking his safety and security very… pic.twitter.com/hRQgBxkFxU
— V Chandramouli (@VChandramouli6) October 19, 2024
Also Read : బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్?
సల్మాన్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు?
బిష్ణోయ్ సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసింది బిష్ణోయి గ్యాంగ్. దీని కారణంగానే ఆ గ్యాంగ్ సల్మాన్‌ను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ముంబైలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపారు.
Also Read : టీవీ యాంకర్ టు మిస్ ఇండియా.. నికిత లైఫ్ జర్నీ!
తాజాగా బాబా సిద్దిఖి హత్య వెనుక కూడా ఇదే కారణం ఉందని అనుమానిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంవల్లే సిద్దిఖీని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్‌కు సపోర్ట్ చేసే ఎవరికైనా ఇదే గతి పడుతుందని బిష్ణోయ్ గ్యాంగ్ ఓ సోషల్‌మీడియా పోస్టు పెట్టింది.
Also Read : జానీని ఫస్ట్ ఆమె.. అనీ మాస్టర్ చెప్పిన సంచలన నిజాలు!