ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన 'సత్యం సుందరం' మూవీ ఇటీవలే థియేటర్స్ లో రిలీజై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. By Anil Kumar 19 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్స్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'సత్యం సుందరం' మూవీ గత నెల 28 న థియేటర్స్ లో రిలీజై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' కు పోటీగా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో కార్తీ నటనకు ప్రసంశలు దక్కాయి. సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. Also Read : 'గేమ్ ఛేంజర్' డ్యూయెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా? కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి '96' లాంటి కల్ట్ క్లాసిక్ మూవీని తెరకెక్కించిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తీశారు. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. Also Read : చంపేస్తామని బెదిరింపులు.. ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ ఏం చేశాడో తెలుసా? తెలుగులో 'దేవర' హడావుడి వల్ల ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. కానీ చుసిన ఆడియన్స్ మాత్రం మెచ్చుకున్నారు. అలాంటి ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. 'సత్యం సుందరం' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. Also Read : కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో కాస్త ముందుగానే.. ఒప్పందం ప్రకారం అయితే నెల రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి. మొదట దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట. అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫీల్ గుడ్ మూవీస్ ను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు. Also Read : బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్? #hero-karthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి