కోలీవుడ్ స్టార్ హీరోను అన్నయ్య అని పిలిచిన సాయి పల్లవి.. బాధపడ్డ హీరో

శివకార్తికేయన్, సాయిపల్లవి 'అమరన్' మూవీ ఆడియో లాంచ్‌ చెన్నై లో జరిగింది. ఈవెంట్ లో శివకార్తికేయన్.. సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమె తనను అన్నయ్య అని పిలిచిందని, తమ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
sai pallvi

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఓ కోలీవుడ్ స్టార్ హీరోను పుసుక్కున 'అన్నయ్య' అనేసింది. దీంతో ఆ హీరో చాలా బాధ పడ్డాడట. ఈ విషయాన్ని సదరు హీరో అందరిముందే బయటపెట్టాడు. ఇంతకీ సాయి పల్లవి అన్నయ్య అని పిలిచింది మరెవరో కాదు, తమిళ హీరో శివకార్తికేయన్ ను..

Also Read : బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్జే శేఖర్‌ బాషా అరెస్ట్‌?

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా 'అమరన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.  ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో కనిపించనున్నారు. 

Also Read : టీవీ యాంకర్‌ టు మిస్‌ ఇండియా.. నికిత లైఫ్ జర్నీ!

ఆ టైంలో సాయి పల్లవిని కలిశాను..

తాజాగా చెన్నై వేదికగా దీని ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శివ కార్తికేయన్.. తాను యాంకర్ గా చేస్తున్న రోజుల్లో సాయి పల్లవిని ఫస్ట్ టైం కలిశానని చెబుతూ వాళ్ళ మధ్య జరిగిన  ఫన్నీ ఇన్సిడెంట్ ను బయటపెట్టాడు." గతంలో నేను టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

Also Read : జానీని ఫస్ట్‌ ఆమె.. అనీ మాస్టర్ చెప్పిన సంచలన నిజాలు!

 ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను.." అని చెప్పుకొచ్చాడు. ఇక 'అమరన్' సినిమా గురించి మాట్లాడుతూ..' మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ గురించి మొదట వార్తల్లో విన్నా. రాజ్‌ కుమార్‌ ఈ కథను వివరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యా.

Also Read : 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది

 ముకుంద్‌ గొప్ప లీడర్‌. కశ్మీర్‌లో 100రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాం. రాత్రిపూట కావడంతో చలి ఎక్కువగా ఉండేది. ఈ చిత్రం క్లైమాక్స్‌ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ముకుంద్‌ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని అందరూ గౌరవించేలా దీన్ని తీర్చిదిద్దాం..' అని అన్నాడు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు