Rahasya baby shower: గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం భార్య రహస్య సీమంతం వేడుక.. ఫొటోలు ఇక్కడ చూడండి

కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ శ్రీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రహస్య తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

New Update

 Rahasya baby shower: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం- నటి రహస్య గోరక్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. మరో 4 నెలల్లో రహస్య పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రహస్య శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కిరణ్ అబ్బవరం. ఇందుకు సంబంధించిన ఫొటోలను రహస్య తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. బేబీ బంప్ తో రహస్య ఫొటోలు ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా రహస్య- కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

 

rahasya baby shower
rahasya baby shower

2024లో వివాహం

రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించిన రహస్య- కిరణ్.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట 2024లో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే కిరణ్ ఇటీవలే 'క' సూపర్ హిట్ కొట్టాడు.  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'క' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.  ఈ సినిమా భారీ సక్సెస్ తర్వాత.. మళ్ళీ దిల్ రూబా సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నారు కిరణ్.  ప్రస్తుతం K-Ramp  అంటూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు.

Kiran Abbavaram -Rahasya Gorak baby shower
Kiran Abbavaram -Rahasya Gorak baby shower

ALSO READ:Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్‌ పిరికిపంద చర్య'.. సెలబ్రిటీలను తిట్టిపోస్తున్న నెటిజన్లు

telugu-news | cinema-news | kiran-abbavaram | rahasya-gorak | baby-shower

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు