Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్‌ పిరికిపంద చర్య'.. సెలబ్రిటీలను తిట్టిపోస్తున్న నెటిజన్లు

పాకిస్థానీ నటులు హానియా ఆమీర్, మహీరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఆపరేషన్ సిందూర్' వ్యతిరేకంగా వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
operation sindoor backlash on pakistani celebrities

operation sindoor backlash on pakistani celebrities

Operation Sindoor: కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతిస్పందనగా  భారత్ సైన్యం మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రతీకార చర్య చేపట్టింది. కాశ్మీర్ (PoK)లోని పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 70 కి పైగా ఉగ్రవాదులు మరణించారు. 

పాకిస్థానీ నటుల పోస్టులు

దీంతో ఈ ఆపరేషన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తగా..  పాకిస్థానీ నటులు హానియా ఆమీర్, మహీరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఆపరేషన్ సిందూర్' కి వ్యతిరేకంగా వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. భారత్ లో పాకిస్థాన్ నటుల సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయినప్పటికీ..  వారి పోస్ట్‌ల స్క్రీన్‌షాట్‌లు NRIల ద్వారా ట్విట్టర్‌లో విస్తృతంగా వ్యాపించాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నెటిజన్ల విమర్శలు 

భారత సైన్యం దేశ భద్రత కోసం చేసిన చర్యను "పిరికితనం" అని అభివర్ణించడంపై  మండిపడుతున్నారు. వారిపై సోషల్ మీడియాలో  విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యల పై ఓ నెటిజన్ స్పందిస్తూ..  ''హనియా అమీర్ భారత సైన్యాన్ని పిరికివాడిని అంటోంది. భారతదేశంలో నివసిస్తున్నప్పుడు ఎవరైనా ఆమెను చులకన చేస్తుంటే నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.'' అని రాసుకొచ్చాడు.

 

మరో నెటిజన్ .. ''మా ఆపరేషన్ సిందూర్ గురించి మీరు మౌనం వీడినందున..  మహిరా ఖాన్ దీనికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను.  ముస్లింలు కాదనే కారణంతో మా ప్రజలను చంపినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. మా 26 మంది చంపబడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? '' అని రాసుకొచ్చాడు.  హనియా మహిరాతో పాటు, పాకిస్తానీ నటులు ఫవాద్ ఖాన్,  మావ్రా హోకేన్ కూడా భారతీయ ఆపరేషన్‌పై వ్యతిరేక పోస్టులను పంచుకున్నట్లు తెలుస్తోంది.

latest-news | telugu-news | Pahalgam attack | Pakistan actors | Pakistan celebrities backlash  Bollywood vs Pakistani actors

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు