/rtv/media/media_files/2024/11/27/JEJ0e458UATeuAUnWCuk.jpg)
Keerthi Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన చిన్ననాటి స్నేహితుడినే ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ నిజమేనని తేలిపోయింది. తాజాగా నటి కీర్తి సురేష్ సోషల్ వేదికగా తన కాబోయే భర్త గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
15 years and counting ♾️🧿
— Keerthy Suresh (@KeerthyOfficial) November 27, 2024
It has always been..
AntoNY x KEerthy ( Iykyk) 😁❤️ pic.twitter.com/eFDFUU4APz
Also Read : గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం
15 ఏళ్ళ బంధం.. కాబోయే భర్తతో కీర్తి సురేష్
''మా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది''.. అంటూ కాబోయే భర్త ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది కీర్తి. దీంతో కీర్తి అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. అయితే కీర్తి, ఆంటోనీ 15 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. కీర్తి సురేష్ ఫ్యామిలీకి కూడా ఆంటోనీ బాగా తెలిసినవాడేనని సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్ళికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : కాంగ్రెస్ కరకుగుండెలు... కేటీఆర్ ఫైర్!
/rtv/media/media_files/2024/11/27/u1odKGGZ3UnoOZwednrl.jpg)
ప్రస్తుతం కీర్తి వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ చిత్రాలతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
Follow Us