/rtv/media/media_files/2025/03/09/6HJsamHlFStHgx1uVUZb.jpg)
Kayadu Lohar
kayadu lohar: 'డ్రాగన్' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన కయాదు లోహార్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) మద్యం కుంభకోణం కేసులో కయాదుకి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మద్యం స్కామ్ లో నిందితులైన వ్యక్తులు నిర్వహించిన పార్టీలకు కయాదు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీలకు హాజరయ్యేందుకు ఒక్క రాత్రికి రూ. 35 లక్షలు డిమాండ్ చేసిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
టాస్మాక్ కుంభకోణంలో కయాదు!
తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ నిర్వహించిన దాడుల్లో కయాదు పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. . అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు బయటకు రాలేదు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణల వస్తున్నా.. కయాదు టీమ్ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఈ యంగ్ బ్యూటీ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఆమె సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: Cannes 2025: ఈ మిస్టరీ బుక్ లో ఏముంది?.. కేన్స్ లో మెగాస్టార్ 'విశ్వంభర' బుక్ విడుదల
1,000 కోట్ల మేర అవినీతి
టాస్మాక్ మద్యం కుంభకోణం ఒక రూ. 1,000 కోట్ల మేర అవినీతి ఆరోపణలతో కూడిన కేసు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ద్వారా మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై ఈడీ ముమ్మర దాడులు నిర్వహిస్తోంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.
35 Lakhs/ night to attend parties
— திறன் ஆய்விடம் (@ThiranAayvidam) May 22, 2025
hosted by those Individuals... ? 🤔🤔🤔#KayaduLoharHot 🔥🔥 #KayaduLohar #KayadhuLohar#EDRaid #TASMAC #TasmacScam https://t.co/yswnizXyyw pic.twitter.com/AztpNnClnz
ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం కయాదు, సిలంబరసన్ హీరోగా వస్తున్న ‘STR49’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.
telugu-news | cinema-news | telugu-cinema-news | kayadu lohar
Also Read: RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు