ప్రముఖ నటి కస్తూరి అరెస్ట్ అయింది. తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!
తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నటి కస్తూరి వేసిన పిటిషన్‌ను కోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో ఆమె పరారీలో ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. చివరికి నటి కస్తూరి ఆచూకీ హైదరాబాద్లో లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.
ఏం జరిగింది?
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు
ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమిళులం అంటూ చెప్పుకుని తిరుగుతున్నారని అన్నారు. అదే సమయంలో ఎప్పుడో ఇక్కడకి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
ఇతరుల భార్యలపై మోజు పడవద్దని.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెప్పడం వల్లనే తమిళ నాట వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది అని తీవ్ర విమర్శలు చేసింది. ఆ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
ఇక తన వ్యాఖ్యలపై కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ పలు చోట్ల ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేయగా.. ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు నిరాకరించడంతో నేడు పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.