Prabhas మూవీలో హీరోయిన్ ఛాన్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన కరీనా కపూర్

ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా.. ఈ వార్తలపై నోరు విప్పింది. ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి ఎవరు కూడా నన్ను సంప్రదించలేదని చెప్పింది.

New Update
karina

పాన్ ఇండియా హీరో ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘స్పిరిట్‌’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను టి.సిరీస్‌, భద్రకాళి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read : దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ

ఎలాంటి నిజం లేదు..

ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా.. ఈ వార్తలపై నోరు విప్పింది.' 'స్పిరిట్' సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు. 

Also Read : 'మెకానిక్ రాకీ' ట్రైలర్.. కామెడీ, లవ్, యాక్షన్ తో అదరగొట్టిన విశ్వక్ సేన్

ఒకవేళ ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను..' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో 'స్పిరిట్' లో ఆమె నటిస్తున్నట్లు వస్తున్న వార్తలకు పులిస్టాప్ పడింది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నఈ సినిమాలో  మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడని గట్టి టాక్ నడుస్తోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు.

Also Read : 'అన్ స్టాపబుల్ సీజన్ 4' షూటింగ్.. సీఎంతో బాలయ్య పిక్ వైరల్

కెరీర్‌లో తొలిసారి ఆయన పోలీస్‌ పాత్రను చేస్తుండటం విశేషం. ఇదెక్కటే కాదు ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్‌ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని చెబుతున్నారు. కాగా  ప్రభాస్ బర్త్ డే రోజున ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాతలు  దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు