/rtv/media/media_files/2025/06/26/preity-mukhundhan-2025-06-26-17-27-36.jpg)
Preity Mukhundhan
Preity Mukhundhan: మంచు 'కన్నప్ప' సినిమాలో హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కన్నప్ప నుంచి విడుదలైన లవ్ సాంగ్ లో ఫుల్ రొమాంటిక్ అవతార్ లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఈముద్దుగుమ్మ ఎవరా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బ్యాక్ గ్రౌండ్, సినీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
ప్రీతి ముకుందన్ ఎవరు?
ప్రీతి ముకుందన్ తమిళనాడులోని తిరుచ్చిలో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ పూర్తి చేసిన ఈ బ్యూటీ.. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ, కొన్ని టీవీ కమర్షియల్స్ లో కూడా నటించింది. ఇది మాత్రమే కాదు చిన్నప్పటి నుంచే భరతనాట్యం కూడా నేర్చుకుంది. దీంతో పాటు హిప్ హాప్, వెస్ట్రన్, ఫోక్ డాన్స్ లలో కూడా మంచి ప్రావీణ్యం పొందింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/26/preity-mukhundhan-pic-two-2025-06-26-17-28-52.png)
సినిమా రంగ ప్రవేశం
మోడలింగ్, టీవీ షోలతో కెరీర్ మొదలు పెట్టిన ప్రీతీ మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఒక్కసారిగా పాపులరైంది. ఆమె చేసిన 'ముత్తు ము2' అనే మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్ మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు మొదలయ్యాయి. తెలుగులో మొదటగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'ఓం భీమ్ బుష్' నటించింది. ఈ సినిమాలో ప్రీతీ తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అంతకుముందు తమిళంలో కెవిన్ హీరోగా వచ్చిన 'స్టార్' సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/26/preity-mukhundhan-pic-one-2025-06-26-17-28-52.png)
'కన్నప్ప' తో స్టార్ డమ్ దిశగా
అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోయిన్ క్రేజ్ రాలేదు. ఇప్పుడు 'కన్నప్ప' తో అయినా ఈ బ్యూటీకి స్టార్ డమ్ వరిస్తుందా? చూడాలి. 'కన్నప్ప' లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం ప్రీతి కెరీర్ కి ఒక కీలకమైన అడుగు. ఈ సినిమాలో ఆమె 'నెమలి' అనే రాకుమార్తె పాత్రలో నటిస్తుంది. అయితే మొదటగా ఈ పాత్ర కోసం వేరే హీరోయిన్ ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో, ఆ అవకాశం ప్రీతి ముకుందన్ ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే ప్రీతికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
telugu-news