Devara Japan Release: 'దేవర' జపాన్ రిలీజ్ షురూ.. ఎప్పుడంటే..?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ రీసెంట్ బ్లాక్ బస్టర్ "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు.

New Update
Devara Japan Release

Devara Japan Release

Devara Japan Release: జూనియర్ ఎన్టీఆర్(jr.ntr), కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ "దేవర పార్ట్-1" గత ఏడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో తొలిసారి అడుగు పెట్టగా, సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంటుంది అని డైరెక్టర్ కొరటాల శివ ముందే అనౌన్స్ చేసిన సంగతి తేలిసిందే. అయితే "దేవర పార్ట్-2" కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

"దేవర పార్ట్-1" తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలవగా ఇప్పుడు జపాన్ లో తన లక్ పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు టాలీవుడ్ సినిమాలు జపాన్‌లో కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన "దేవర" కూడా జపాన్‌లో విడుదలకానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు స్టార్ట్ చేసారు ఎన్టీఆర్, జపాన్‌ అభిమానులతో వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు.

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

మార్చి 28న  'దేవర' జపాన్ రిలీజ్..

"దేవర పార్ట్-1" మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు