Devara OTT: ఈ దసరాకు బాక్సాఫీస్ దగ్గర విశ్వం, వేట్టయన్, మానాన్న సూపర్ హీరో, మార్టిన్, జనక అయితే గనక.. సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. కానీ వీటికన్నా ముందు అప్పటికే థియేటర్స్ లో రన్ అవుతున్న 'దేవర' మాత్రం పండగ సమయంలో భారీ ఆదరణ దక్కించుకుంది.
Also Read : RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
తాజాగా ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లో చేరిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దాని ప్రకారం.. సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన 'దేవర' నవంబర్ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.
Also Read : విశ్వక్ సేన్ కొత్త సినిమా విడుదల వాయిదా
నెట్ ఫ్లిక్స్ లో..
అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే నెట్ ఫ్లిక్స్ తో నిర్మాతలకు ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 8 నుంచే 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా నెట్ ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించి అదరగొట్టేశాడు.
Also Read : యాక్షన్ తో అదరగొట్టిన సమంత.. 'సిటాడెల్' ట్రైలర్ చూశారా?
అలాగే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అంద చందాలతో తెలుగు ఆడియన్స్‌ని కట్టిపడేసింది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా.. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పార్ట్-2 పై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. 2026 లో 'దేవర' పార్ట్-2 ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : ప్రతీ సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది.. 'పుష్ప2' పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్