Naniodela2 : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో కథా నాయిక ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మొదట జాన్వీ కపూర్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మరో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలిసింది.

naniodela2
New Update

న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవుతున్నాడు. రీసెంట్ గానే 'సరిపోదా శనివారం' తో హిట్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం 'హిట్ 3' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇటీవల దసరా పండగ రోజు శ్రీకాంత్ ఓదెలతో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. 'దసరా' తో భారీ సక్సెస్ అందుకున్నా ఈ కాంబోలో తెరకెక్కనున్న రెండో సినిమా ఇది. 

Also Read : 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

డైరెక్టర్ శ్రీకాంత్ ఈసారి నాని కోసం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే  ఓ పీరియాడిక్‌ కథని సిద్ధం చేశారు. 'దసరా' మూవీతో పోలిస్తే వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాస్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. 

Also Read : సీఎం రేవంత్ ను కలిసిన రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్.. ఎందుకో తెలుసా!?

ఆమెనే ఫైనల్ చేశారా?

సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ఇందులో నానికి జోడిగా 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్‌కి చెందిన మరో భామ శ్రద్ధా కపూర్‌నీ చిత్రబృందం సంప్రదించినట్టు తెలిసింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో, అందుకు తగ్గ కథానాయికే ఉండాలనేది దర్శకనిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.

Also Read : వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?

అందుకే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కథానాయిక ఎంపికపైనే దృష్టి పెట్టారట. జాన్వీ ఇప్పటికే 'RC16' ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటంతో  శ్రద్ధా కపూర్‌ ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Also Read : ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

#tollywood #actor-nani #srikanth-odela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe