/rtv/media/media_files/2025/05/20/arGdzCxBJRmdaaiVyKKB.jpg)
Jayam Ravi: మలయాళ ప్రముఖ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వీరి విడాకుల దరఖాస్తు పై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆర్తి విడాకుల తర్వాత తన భర్త రవి మోహన్ నుంచి నెలకు రూ. 40లక్షల అలిమోని (మెయింటెనెన్స్) డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
40 లక్షల అలీమొనీ
అయితే ఇటీవల చెన్నె ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరైన జయం రవి.. ఇకపై ఆర్తితో వైవాహిక బంధం కొనసాగించలేనని, విడాకులు మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం. దీంతో భార్య ఆర్తి నెలకి రూ. 40 లక్షలు నెలకి అలిమోనిగా ఇవ్వాలని కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసారు.
/rtv/media/media_files/2025/05/22/FjF7lTwaJBkkTA9enQ5i.jpg)
2009లో వివాహం
జయం రవి - ఆర్తి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్, ఆరవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, 2024లో తాను భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. అయితే భార్య ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే రవి విడాకుల ప్రకటన చేశారని ఆరోపించింది. ఈ నిర్ణయానికి తాను, పిల్లలు షాక్ అయ్యాం" అని పేర్కొన్నారు
మూడో వ్యక్తి వల్లే
కెనిషా ఫ్రాన్సిస్ అనే మహిళ రవి మోహన్ జీవితంలోకి రావడం వల్లే తమ వివాహం విచ్చిన్నమైందని ఆర్తి పబ్లిక్ గా పోస్ట్ పెట్టారు. మరోవైపు రవి "ఈ పెళ్లిలో తనకు మానసిక వేదన, ఒంటరితనం ఎక్కువయ్యాయి" అని ఆరోపణలు చేశారు.
telugu-news | latest-news | cinema-news | Aarti-jayam ravi | actor-jayam-ravi | jayam ravi - aarti divorce
Also Read : కమల్ - శింబు ఫేస్ ఆఫ్.. మణిరత్నం గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్' ట్రైలర్