Janaki vs State of Kerala: కేంద్రమంత్రి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిరాకరణ!

కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపి, అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ సినిమాకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. సీతాదేవి మరో పేరైన జానకిని దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టబోమని బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించింది.

New Update
Janaki vs State of Kerala

Janaki vs State of Kerala

కేంద్ర మంత్రి, నటుడు సురేశ్‌ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన కొత్త చిత్రం ‘జానకి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ’. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ ‘జానకి’ పాత్రలో,  సురేశ్‌ గోపి లాయర్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సెన్సార్ బృందం గట్టి షాక్ ఇచ్చింది. ‘జానకి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ నిరాకరించింది. దీంతో ఇది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 

Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

సీతాదేవి పేరుపై అభ్యంతరం

సీతాదేవికి మరొక పేరు అయిన ‘జానకిని’ అలాంటి పాత్రకు పెట్టకూడదని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా వెల్లడించారు. ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించిందని ఆయన తెలిపారు. ఇదే విషయంపై ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ మీడియాతో మాట్లాడారు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

ఈ సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించ వద్దని సెన్సార్‌ బోర్డు నిర్మాతలకు తెలిపిందని ఆయన అన్నారు. టైటిల్‌, పాత్ర పేరును ఛేంజ్ చేయాలని బోర్డు మూవీ యూనిట్‌కు సూచించిందని పేర్కొన్నారు. మూవీలో దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టడానికి వీలులేదని సెన్సార్ బోర్డు చెప్పిందని తెలిపారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. 

Advertisment
తాజా కథనాలు