Santhana Prapthirasthu: రొమాన్స్, ఎమోషన్..  అదరగొడుతున్న 'సంతాన ప్రాప్తిరస్తూ' ట్రైలర్!

యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ, విక్రాంత్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తూ మూవీ ట్రైలర్ విడుదలైంది. లవ్, రొమాన్స్, కామెడీ,  భావోద్వేగ సన్నివేశాలతో  సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update

Santhana Prapthirasthu: యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ, విక్రాంత్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సంతాన ప్రాప్తిరస్తూ మూవీ ట్రైలర్ విడుదలైంది.స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. 
 లవ్, రొమాన్స్, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో  సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు  సన్నివేశాలు పూయించాయి.

'సంతాన ప్రాప్తిరస్తూ' ట్రైలర్

ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న హీరో విక్రాంత్ హీరోయిన్ చాందినితో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత..ఈ విషయం  చాందిని తండ్రి మురళీధర్ గౌడ్ కి తెలుస్తుంది. దీంతో మురళీధర్ వారి పెళ్ళికి అడ్డు చెబుతాడు. అయినప్పటికీ హీరో లెక్కచేయకుండా చాందిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ పెళ్ళైన  కొన్ని రోజులకు విక్రాంత్ జీవితంలో ఊహించని సమస్య ఎదురవుతుంది.  హీరోకు 'తక్కువ స్పెర్మ్ కౌంట్' సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తండ్రి హీరోకు ఒక సవాల్  విసురుతాడు.  తనను అల్లుడిగా స్వీకరించాలంటే 100 రోజుల్లో తన కూతురు గర్భవతి అయ్యేలా చూడాలని అంటాడు. 

ఈ సవాలును స్వీకరించిన హీరో ఆ సమస్యను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు, మధ్య మధ్యలో  వెన్నెల కిషోర్,  అభినవ్ గోమఠం కామెడీ సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంది. సంతానోత్పత్తి అనే క సున్నితమైన అంశాన్ని హాస్యభరితంగా చూపిస్తూ మంచి మెసేజ్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. 

మధుర ఆడియో, మధుర ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. న్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. 

Also Read: Thottam Title Teaser: మళ్ళీ కొత్త అవతారమెత్తిన కీర్తి సురేష్.. 'తోట్టం' టీజర్ గూస్  బంప్స్!

Advertisment
తాజా కథనాలు