Singer Chinmayi: సోషల్ మీడియా ట్రోలర్స్ కి సింగర్ చిన్మయి బిగ్ షాక్ !

టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తరచు ఏదొక వివాదం పై వార్తలో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఈమె పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోలీస్ కేసు నమోదు చేసింది. 

New Update

Singer Chinmayi: టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద తరచు ఏదొక వివాదం పై వార్తలో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఈమె పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోలీస్ కేసు నమోదు చేసింది.  తాను, తన పిల్లలను అసభ్యకరంగా దూషిస్తున్నారని సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. ట్రోలర్స్‌ అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ సరైన యాక్షన్ తీసుకోవాలని కోరింది. చిన్మయి ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరు ట్రోల్ చేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి..  ట్రోలర్స్ అకౌంట్స్ గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ట్రోలర్లు తమ అకౌంట్లను డీ యాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలు వివాదమేంటి.. 

అయితే ఇటీవలే సింగర్ చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి చిన్మయి హోస్ట్ గా వ్యవహరించగా.. రాహుల్, రష్మిక గెస్టులుగా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ 'మంగళసూత్రం' గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాళి వేసుకోవడం లేదా అనేది పూర్తిగా నా భార్య ఛాయిస్.. ఆ ఫ్రీడమ్ నేను నా భార్యకు ఇచ్చాను అని కామెంట్ చేశారు.  రాహుల్ మంగళసూత్ర గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం నెట్టింట తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. కొంతమంది ఆయన నెటిజన్లు రాహుల్ కామెంట్స్ ను తప్పుపడుతున్నారు.  సోషల్ మీడియాలో చిన్మయి పై ట్రోలింగ్ కి దిగారు. ఆమెను, ఆమె  కుటుంబాన్ని దూషిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో చిన్మయి తనను ఆన్ లైన్ వేధింపులకు గురిచేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర కామెంట్లు చేస్తున్న వారి అకౌంట్లను ట్యాగ్ చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Also Read: Thottam Title Teaser: మళ్ళీ కొత్త అవతారమెత్తిన కీర్తి సురేష్.. 'తోట్టం' టీజర్ గూస్  బంప్స్!

Advertisment
తాజా కథనాలు