/rtv/media/media_files/2025/09/10/little-hearts-2025-09-10-21-01-15.jpg)
Little Hearts
Little Hearts: స్మాల్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ సక్సెస్ అయ్యింది. మొదట చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, విడుదల తర్వాత మంచి రివ్యూలతో పాటు మౌత్ టాక్ ద్వారా భారీ రెస్పాన్స్ పొందుతోంది. వాస్తవానికి ఈ సినిమా వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లో కూడా బాగా కలెక్షన్లు రాబడుతోంది. ఒక స్మాల్ బడ్జెట్ సినిమాకి ఇది చాలా గొప్ప విషయం.
ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో మౌళి తనూజ్, జయకృష్ణ, శివాని నాగరం ప్రధాన పాత్రలు పోషించారు. కథ యువతకు దగ్గరగా ఉండటంతో పాటు, సరదాగా ఉండటంతో ప్రేక్షకుల మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూసాం అన్న ఫీల్ తో థియేటర్ల బయటకి వస్తున్నారు.
Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
ట్విస్టేమిటంటే..
అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) మౌళి తండ్రిగా నటించారు. కానీ మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మార్తాండ్ ఒక పెద్ద ప్లాన్ చేసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ పాత్ర కోసం తొలుత జగపతి బాబునే తీసుకోవాలని అనుకున్నా, స్క్రిప్ట్‌ను మొదట జగపతి బాబు(Jagapathi Babu)కు వినిపించగా, ఆయన కథను చాలా ఇష్టపడ్డారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేకపోయారు అని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో అసలైన ట్విస్టేమిటంటే… జగపతి బాబు ఆ కథలో ఉన్న ఓ లోపాన్ని గుర్తించి దర్శకుడికి చెప్పారు. అదే పాయింట్‌ను తీసుకుని టీమ్ కథను మరింత బాగా రాసుకున్నారట.
ఈ విషయాన్ని చెప్పిన సాయి మార్తాండ్, “జగపతి బాబు గారు సినిమా చేయలేకపోయినా, ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది. కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి, మాకు గొప్ప మార్గనిర్దేశం చేశారు. అందుకు నేను ఆయనకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను,” అంటూ అభినందనలు తెలిపారు.
Also Read: ఫస్ట్ టైమ్.. కొడుకు ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఎంత క్యూట్ గా ఉన్నాడో! పిక్స్ చూశారా
ఈ సినిమా విజయం వెనుక ఉన్న మెయిన్ రు రీజన్ లవ్ స్టోరీ, కథ, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్. వీటిని సరిగ్గా చూపించడంలో దర్శకుడి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ కథతో ప్రేక్షకులను తమ జీవితాల్లోని కాలేజ్ డేస్ ని గుర్తు చేసుకునేలా చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది.