'మా ఇంట మహాలక్ష్మి పుట్టింది'.. తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత

జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత తల్లిదండ్రులు అయ్యారు. సుజాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాకేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.

New Update

Rocking Rakesh - Sujatha :  బుల్లితెర నటి జోర్దార్ సుజాత, జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ గతేడాది ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. సుజాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాకింగ్ రాకేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. మా ఇంట మహాలక్ష్మి పుట్టింది అంటూ పోస్ట్ పెట్టారు. 

రాకింగ్ రాకేష్ పోస్ట్ 

ఈ  నవరాత్రి పర్వదినాలలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని తెలియజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. తనను, సుజాతను మొదటి నుంచి మీ ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.మా పాప పై కూడా మీ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాకింగ్ రాకేష్ పోస్ట్ పెట్టారు. 

jordar sujatha 1

తెలంగాణ భాష పై మంచి పట్టున్న సుజాత  ' జోర్దార్ ' అనే షోలో అచ్చ తెలంగాణ యాసలో వార్తలు చదివి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'జోర్దార్'  సుజాతగా ఫుల్ పాపులరైన ఈమె బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టింది. ఈ షో తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకున్న సుజాత ఓ వైపు  టీవీ షోలు, మరోవైపు సినిమాలు, సీరీస్ లు చేస్తూ  బిజీ అయిపొయింది. ఈ క్రమంలోనే ఓ కామెడీ  షో ద్వారా రాకింగ్ రాకేష్ తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి.. ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇక రాకింగ్ రాకేష్ జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Also Read: 'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్ వీడియో

 

Also Read: సెట్‌లో ఆ బాధ తట్టుకోలేక రోజు ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని.. యానిమల్ బ్యూటీ!

#rocking-rakesh #jabardasth-artists #jordar-sujatha #Bathukamma 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe