'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ వీడియో రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురి గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లి చనిపోయిన తర్వాత తన కూతురిలో అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆమె మరణించడంతో రాజేంద్రప్రసాద్ తీరని దుఃఖంలో మునిగారు. By Archana 05 Oct 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update Rajendra Prasad Daughter షేర్ చేయండి Rajendra Prasad : సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి చిన్న వయసులోనే కన్నుమూశారు. చాతిలో నొప్పి రావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గురించి మాట్లాడుతూ ఎమోషనలైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: సెట్‌లో ఆ బాధ తట్టుకోలేక రోజు ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని.. యానిమల్ బ్యూటీ! నా కూతురిలో మా అమ్మను చూసుకున్నాను.. అయితే గతంలో 'బేవార్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ .. ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మ పై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురిని గుర్తుచేసుకొని భావిద్వేగానికి గురయ్యారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నా కూతురిలోనే మా అమ్మను చూసుకున్నా.. కానీ కొన్నాళ్లుగా నా కూతురితో నాకు మాటల్లేవు.. ఆమె ఒకరిని ప్రేమించి అతడితో వెళ్లిపోయిందని ఎమోషనల్ అయ్యారు. అప్పుడు రాజేంద్రప్రసాద్ తన కూతురిని ఇంటికి పిలిచి 'బేవార్స్' సినిమాలోని అమ్మ పాటను ఆమెకు వినిపించారట. అలా పాట రూపంలో కూతురి మీదున్న ప్రేమను చెప్పాను అని తెలిపారు. ఇప్పుడు ఆయన కూతురు అనారోగ్యంతో మరణించడంతో ఈ వీడియో మరో సారి నెట్టింట వైరల్ గా మారింది. రాజేంద్రప్రసాద్ కు కూతురి పై ఉన్న ప్రేమను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం పట్ల పలువురు సినీ తారలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ కూడా సానుభూతి తెలియజేశారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతిప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి… — Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 5, 2024 నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. — Jr NTR (@tarak9999) October 5, 2024 Also Read: సెట్‌లో ఆ బాధ తట్టుకోలేక రోజు ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని.. యానిమల్ బ్యూటీ! #tollywood #rajendra-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి