/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/452061974_793065959540849_2042233900612062288_n.jpg)
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ యానిమల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో త్రిప్తి తన అందచందాలతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి తన కెరీర్ తొలి నాళ్ళను గుర్తుచేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451784412_1633162507479139_8932409398445476432_n.jpg)
త్రిప్తి చదువులో రాణించలేకపోవువడంతో. తాను మోడలింగ్ వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తే వారు అంగీకరించలేదట. అయినా సరే పట్టుదలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లు త్రిప్తి చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451780044_1641058000051086_7618216913714068784_n.jpg)
అయితే ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో కనీసం ఆమెకు ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో కూడా తెలియదట. అప్పటికీ తాను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదని. అసలు ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్ని ఎన్నో సార్లు ఆలోచించినట్లు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/452069167_998481298402323_4754241672919443266_n.jpg)
తన తొలి సినిమా ‘లైలా మజ్ను’ వాళ్ళు చెప్పే భాష అర్దమవకపోవడంతో ప్రతి రోజూ సెట్ లో ఏడ్చేదట. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన పాత్ర డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని’ అంటూ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంది త్రిప్తి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/452372821_3735806996675619_468370681527242520_n.jpg)
ఇటీవలే త్రిప్తి హిందీలో విక్కీ కౌశల్ సరసన 'బ్యాడ్ న్యూస్' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం త్రిప్తి వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451780044_1641058000051086_7618216913714068784_n.jpg)
విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలయ్యా 3, ధడక్ 2 చిత్రాలు చేస్తోంది. భూల్ భూలయ్యా 3 చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తుండగా విద్యాబాలన్, మాధురీదీక్షిత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధడక్ 2 షాజియా ఇక్బాల్ తెరకెక్కిస్తున్నారు. ఇక విక్కీ 'విద్యా కా వో వాలా వీడియో' చిత్రం ఈనెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.