Samantha in Love : మళ్లీ ప్రేమలో పడ్డ సమంత..  పోస్ట్ వైరల్.. అతగాడు ఎవరంటే?

సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న వాలంటైన్స్‌డే రోజున సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకు ఇందులో ఏముందంటే..  ఓ వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లు..  పూలు వికసించిన ఫోటోలు షేర్ చేసింది సమంత.

New Update
samantha love

Samantha in Love: స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఇంతకు ఇందులో ఏముందంటే.. ఓ వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లు..  పూలు వికసించిన ఫోటోలు షేర్ చేసింది సమంత. అంతేకాకుండా దీనికి లవ్‌ సింబల్‌ను కూడా జోడింంచింది. దీంతో సామ్ మళ్లీ ప్రేమలో పడిందన్న గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీమ్యాన్, సిటాడెల్ డైరెక్టర్‌.. రాజ్‌ నిడిమోరుతో సమంత లవ్‌లో ఉన్నట్లుగా గతకొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే దీనిపై వీరిద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా తమ పని తాము చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.  చైతూతో విడాకుల అనంతరం.. రాజ్‌ నిడిమోరుకు చాలా క్లోజ్ అయింది సమంత. ఇద్దరు బహిరంగగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఈ క్రమంలో వీరి డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.  

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో

కాగా..  ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. ఇంజనీరింగ్ స్టడీ చేసిన  రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.  అక్కడ తన ఫ్రెండ్  కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్‌ ఫిల్స్మ్‌ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదటగా షాదీ అనే షార్ట్‌ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో బాగా ఫేమస్ అయ్యారు.   ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నుంచి రాజ్‌, సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఇటీవల వీరి కాంబోలో వచ్చిన  సిటాడెల్‌ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.  ఇక సమంత విషయానికి వస్తే గతంలో ఆమె నటుడు నాగ చైతన్యను 2017లో ప్రేమవివాహం చేసుకున్నారు, అయితే ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నాగ చైతన్య హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు.

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు