/rtv/media/media_files/2025/09/23/allu-arjun-2025-09-23-17-40-43.jpg)
Allu Arjun
Allu Arjun: తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్(Mirai Box Office Collection) వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇప్పటికే రూ.130 కోట్ల మార్క్‌ను దాటి, త్వరలో రూ.140 కోట్లు వసూలు చేసే దిశగా సాగుతోంది. ఈ సినిమాకు కార్తిక్ గట్టమనేని దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ కూడా ఆయనే చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
ఈ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. తాజగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘మిరాయ్’పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన తన X (Twitter) ఖాతాలో మిరాయ్ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ స్పందించారు.
Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.
— Allu Arjun (@alluarjun) September 23, 2025
Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.
My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r
మిరాయ్ టీంకు అభినందనలు!
"ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. తేజ సజ్జా, నీ కష్టానికి, డెడికేషన్‌కి కంగ్రాట్స్. ఇలాంటి సినిమాను చేయడం అంటే చిన్న విషయం కాదు. నా బ్రదర్ మంచు మనోజ్ బ్రిలియంట్‌గా పెర్ఫామ్ చేశారు. రితికా నాయక్, శ్రియ శరణ్, జగపతిబాబు లు తమ పాత్రల్లో బలంగా కనిపించారు" అని అన్నారు.
అలాగే ఈ సినిమా టెక్నికల్ గా చాలా రిచ్‌గా ఉందని, సీజీ, ఆర్ట్, సౌండ్ మిక్సింగ్, గౌర హరి సంగీతం వంటి అంశాలన్నీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయన్నారు. దర్శకుడు కార్తిక్ గట్టమనేని చూపిన విజన్ ప్రశంసించదగినదని, ఆయనను "న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్" అని అభివర్ణించారు. అలాగే నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా తమ మద్దతు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రశంసలు కురిపించడం మిరాయ్ టీమ్‌కు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈ సినిమా విజయం చూసి తేజ సజ్జా కెరీర్‌కి ఇది ఓ మైలురాయిగా మారబోతోందని చెబుతున్నారు.