Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు  'ఐబొమ్మ' వార్నింగ్!

మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేస్తామని ఎప్పుడో చెప్పాము! అంటూ నిర్మాతలకు ఐబొమ్మ వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏంటి? ఒక పైరసీ వెబ్ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటి అని ఆలోచిస్తున్నారా?

New Update

Vijay Devarakonda: మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేస్తామని ఎప్పుడో చెప్పాము! అంటూ నిర్మాతలకు ఐబొమ్మ వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏంటి? ఒక పైరసీ వెబ్ సైట్ నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటి అని ఆలోచిస్తున్నారా? అవునండీ  తాజాగా 'ఐబొమ్మ' సైట్  నుంచి లీకైన  ఒక నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'  సినిమా రిలీజైన ఒక్క రోజులోనే పైరసీ భూతానికి బలైంది. మూవీ హెచ్ డీ ప్రింట్ పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మలో లీకైంది. మరి ఐ బొమ్మలో లీకైనప్పుడు.. నిర్మాతలు ఐబొమ్మకు వార్నింగ్ ఇవ్వాలి కానీ, ఐబొమ్మ నిర్మాతలకు ఎందుకు వార్నింగ్ ఇచ్చిందేంటి? 

i bomma
i bomma

ఐ బొమ్మ వార్నింగ్!

అయితే ఐబొమ్మ పేరుతో మరో ఫేక్ సైట్స్ క్రియేట్ చేసి పైరసీ కాపీ ప్రదర్శిస్తున్నారని, దానికి కారణం నిర్మాతలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిర్మాతలు తమ సినిమా పైరసీ కాకుండా కొంతమంది ఏజెన్సీలకు డబ్బులు ఇస్తున్నారు. కానీ, ఆ ఏజెన్సీల వల్లే పైరసీ పెరిగిపోతుందని ఐబొమ్మ మండిపడింది. మీరు వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మిమల్ని తొక్కి.. మా పేరుతో ఫేక్ వెబ్ సైట్లు రన్ చేస్తున్నారు. ఇదంతా కూడా మా బ్రాండ్ నేమ్ ఉపయోగించి జరుగుతోంది. లాస్ట్ టైం విజయ్ 'ఖుషీ' మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. కావున మరో 24 గంటల్లో మీరు  ఆ ఫేక్ వెబ్ సైట్ ని బ్లాక్ చేయకపోతే మా పని మేం చేసుకుంటూ వెళ్తాం అంటూ 'కింగ్డమ్' నిర్మాతలకు ఓ హెచ్చరిక నోట్  రిలీజ్ చేసింది ఐబొమ్మ. మరి ఈ నోట్ నిజంగానే అఫీషియల్ ఐబొమ్మ సైట్ రిలీజ్ చేసిందా? లేదా ఐబొమ్మ పేరుతో మరేదైనా ఫేక్ సైట్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక పైరసీ సైట్ ఇలా నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

ఐ బొమ్మ నోట్ లో ఏముంది?

''మేము మీకు ముందే చెప్పాము. మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేస్తామని! మా పేరుతో ఫేక్ వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఖుషీ మూవీ విషయంలోనూ విజయ్ ఇలాగే నలిగాడు! మరో 24 గంటల్లో ఈ కింది వెబ్ సైట్ బ్లాక్ చేయకపోతే.. మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. అన్ని వెబ్ సైట్లు కాకుండా, సెలెక్టెడ్ మాత్రమే ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఆలోచించారా? మీకు బుర్ర లేదు, కొంచం వాడండి అని ఆ నోట్ లో రాసి ఉంది''. 

ఇదిలా విజయ్ దేవరకొండ  'కింగ్డమ్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మూవీ టేకాఫ్ బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ఒక హై మూమెంట్ ఇవ్వలేకపోయిందని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ- సత్య దేవ్ మధ్య బ్రదర్ సెంటి మెంట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ఎప్పటిలాగే తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి 'కింగ్డమ్' మొదటి రోజు రూ. 39 కోట్ల వసూళ్లు సాధించింది. 

Also Read: Madharaasi: మస్త్ వైబ్ ఉంది బ్రో.. శివ కార్తికేయన్ లవ్ ఫేల్యూర్ సాంగ్ వచ్చేసింది!

Advertisment
తాజా కథనాలు