Madharaasi: కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం తెరకెక్కుతున్న 'మదరాశి'. 'అమరన్ ' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ''సెలవిక కన్నమ్మా''.. అంటూ హీరో లవ్ ఫేల్యూర్ నేపథ్యం సాగిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఫుల్ జోష్ ఉన్న బీట్స్, అదిరిపోయే మ్యూజిక్ తో మస్త్ వైబ్ ఇస్తుంది పాట. ఇందులో శివకార్తికేయన్ మాస్ స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను.. సింగర్ ధనుంజయ్ సీపాన ఆలపించారు. మీరు కూడా ఈ పాటను చూసి ఎంజాయ్ చేయండి.
Time to enjoy our first single #Salambala from #Madharaasi 🔥
— A.R.Murugadoss (@ARMurugadoss) July 31, 2025
With the energetic beats from @anirudhofficial and the superb dance moves by @Siva_Kartikeyan.. Sung by the young @SaiAbhyankkar 🤙
▶️ https://t.co/2BgJ1uPBHb#DilMadharaasi#MadharaasiOnSEP5pic.twitter.com/wMqg4FHXVG
హై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లిమ్ప్స్ లో బాంబు పేలుళ్లు, యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా కనిపించాయి. డైరెక్టర్ మురుగదాస్ గత సినిమాలు గజినీ, తుపాకీ సినిమాల తరహాలో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో రుక్మిణీ వసంత్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. ప్రేమ్ కుమార్, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే జులై 12న తమిళనాడులోని 'తూత్తుకుడి' ప్రాంతంలో మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనుంది.
నెక్స్ట్ పరాశక్తి..
ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు సైమల్టేనియస్ గా 'పరాశక్తి' షూట్ లో పాల్గొంటున్నారు హీరో శివకార్తికేయన్. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. రవి మోహన్, అథర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్లో వివాదం నెలకొంది. అయితే హీరో విజయ్ ఆంటోనీ కూడా తన సినిమాకు 'పరాశక్తి' అనే టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య కొన్ని రోజులు వివాదం నడిచింది. ఆ తర్వాత శివకార్తికేయన్ ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలియడంతో.. ఫైనల్ గా ఆయన సినిమాకే ఈ టైటిల్ దక్కింది.