Cinema: హీరో లేకుండా సినిమా తీస్తా..సందీప్ వంగా

హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు నా గురించి విమర్శలు చేస్తున్న వారందరికీ ఆ సినిమాతో సమాధానం చెబుతానని చెప్పారు. 

New Update
SANDEEP REDDY VANG

SANDEEP REDDY VANG

సందీప్ వంగా...ఇంత క్రేజీ డైరెక్టర్ మరొకరు ఉండరేమో. ఈయన తీసిని రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో పాటూ విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాయి. మితిమీరిన రొమాన్స్ లేదా వైలెన్స్ చూపిస్తారు తన సినిమాల్లో సందీప్ వంగా. అంతేకాదు  ఈయన మూవీస్ లో హీరో కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లను చాలా చులకనగా చూపిస్తారని అంటారు. దీనిపై సమాధానాలు చెప్పారు సందీప్.

హీరో లేకుండా తీస్తే ఎవరికీ నచ్చదు..

తాజాగా జరిగిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సందీప్ వంగా తన సినిమాలపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పారు. అంతేకాదు పాటలు లేకుండా సినిమా తీస్తారా? హీరో లేకుండా సినిమా తీస్తారా అని అడిగితే హీరో లేకుండానే తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అని చెప్పారు. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తానని తెలిపారు.  అయితే అలా మూవీ చేస్తే ఇప్పుడు ఎవరైతే మహిళలు తనను విమర్శిస్తున్నారో అప్పుడు వారే తనను మళ్ళీ విమర్శిస్తారని చెప్పుకొచ్చారు కావాలంటే ఆ విషయాన్ని తాను రాసిస్తానని సందీప్ వంగా నమ్మకంగా చెప్పారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్‌ చెప్పింది. చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు’’ అని చెప్పారు.

ప్రస్తుతం సందీప్ వంగా యానిమల్ పార్క్, ప్రభాస్ తో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. స్పిరిట్ సినిమా బాహుబలి రికార్డులను దాటాలని తారు అనుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2వేల కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం అని...దానిని దాటడం చాలా కష్టమని సందీప్ చెప్పారు. కానీ తానోక మంచి సినిమా తీస్తున్నానని..ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని సందీప్ తెలిపారు. 

Also Read: AP: విడదల రజనీపై విచారణ..అనుమతి కోసం గవర్నర్ కు లేఖ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు