Housefull 5 Trailer: అక్షయ్, అభిషేక్, రితేష్.. హౌస్ ఫుల్ 5 ట్రైలర్.. నవ్వులే నవ్వులు!

అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన హౌస్‌ఫుల్ 5 ట్రైలర్ విడుదల చేశారు. వినోదం, హాస్యం, సస్పెన్స్ సన్నివేశాలతో ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

New Update

Housefull 5:  అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన హౌస్‌ఫుల్ 5 ట్రైలర్ విడుదల చేశారు. ఒక క్రూజ్ షిప్ లో అక్షయ్, రితేష్, అభిషేక్ చుట్టూ జరిగే  కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. జాలీగా సాగుతున్న కథలో అనుకోని హత్య జరగడం ప్రేక్షకులలో సస్పెన్స్ కలిగించింది. మధ్యలో సంజయ్ దత్,  జాకీ ష్రాఫ్ ఎంట్రీ మరో మ్యాజిక్ క్రియేట్ చేసింది. మొత్తంగా వినోదం, హాస్యం, సస్పెన్స్ సన్నివేశాలతో ట్రైలర్  నవ్వులు పూయించింది. 

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

జూన్ 6న విడుదల

సాజిద్ నడియాద్వాలా నిర్మాణంలో తరుణ్ మన్సుఖాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ షర్నో మోరేనా, శ్రేయాస్ షర్నో మోరెనార్, రాంకీ తల్పాడే, ధీర్, జానీ లీవర్,  ఆకాష్‌దీప్ సబీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది. 

telugu-news | cinema-news Housefull 5 Trailer  latest-news | Akshay Kumar 

Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

Advertisment
Advertisment
తాజా కథనాలు