Heroine Tabu: టాలీవుడ్ లో టబు రీ ఎంట్రీ.. అదే డైరెక్టర్ తో మళ్ళీ..

స్టార్ హీరోయిన్ టబు తెలుగులో రీఎంట్రీకి సిద్ధమైంది. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో టబు కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబోలో 'ఇదీ సంగతి' అనే సినిమా వచ్చింది.

New Update
tabu1

tabu

Heroine Tabu: అలనాటి స్టార్ హీరోయిన్ టబు 50 వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది టబు. ఇటీవలే రీసెంట్ గా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అమెరికన్ టీవీ సిరీస్ డూన్: ప్రొఫెసీలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు బాలీవుడ్ లో క్రూ సినిమాతో సూపట్ హిట్ అందుకుంది. వరుస విజయాలతో టబు రేంజ్ మారిపోయింది. 

ఇది కూడా చూడండి: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

టాలీవుడ్ లో టబు రీ ఎంట్రీ

ఈ క్రమంలో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో టబు కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు టాక్. ఈ సినిమాకు సినిమాకు పుస్తక రచయిత, సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ కథ అందించారట. గతంలో టబు, చంద్రసిద్ధార్థ్ కాంబోలో 'ఇదీ సంగతి' అనే సినిమా వచ్చింది. టబు తెలుగు సినిమాతోనే నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. వెంకటేష్ సరసన Coolie No. 1 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. 

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

#tabu #tollywood #hollywood
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు