/rtv/media/media_files/2025/10/13/25-years-to-nuvve-kavali-2025-10-13-14-44-00.jpg)
25 years to nuvve kavali
25 Years Nuvve Kavali: ఇష్టపడితే భయపడకు .. భయపడితే ఇష్టపడకు .. ఇష్టపడి భయపడితే బాధపడకు, ''ప్రేమంటే కంట్లో ఉండే పుట్టుమచ్చ లాంటిది.. మనకు కనిపించదు ఎదుటివాళ్లకు మాత్రమే తెలుస్తుంది''.. అబ్బా ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం అన్నట్లుగా ఉంటాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలతో విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం పేరు 'నువ్వే కావాలి'. 25 years to nuvve kavali
2000 లో విడుదలైన ఈ చిత్రం అప్పటి యువతలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తరుణ్ - రీచా జంటగా అందమైన ప్రేమ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇందులోని మాటలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 'కళ్ళలోకి కళ్ళు పెట్టి...', 'ఎక్కడ ఉన్నా...', 'అందమైన ప్రేమరాణి' వంటి పాటలు ఫుల్ పాపులర్ అయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీలలో ఒకటిగా పేరు పొందింది. తక్కువ బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి సంచలనం సృష్టించింది.
Also Read : ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
25 ఏళ్ళు..
నేటితో ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. అయితే ఈ సినిమా కోసం ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా నలుగురు అనుకున్నారట. చివరికి హీరో తరుణ్ ఒకే చేశారట. ఈ స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇష్టపడితే భయపడకు ..
— Trivikram (@Trivikram_Fans) October 13, 2025
భయపడితే ఇష్టపడకు ..
ఇష్టపడి భయపడితే బాధపడకు ..#NuvveKavali 25 Years To This Classic .. Kudos Vijay Bhaskar Garu & #Gurugaru#Trivikram ..
👏👌@SravanthiMoviespic.twitter.com/03n4ehFcUY
ముగ్గురు హీరోలు
నిర్మాత రవి కిషోర్ ఒక మంచి యువనటుడితో బడ్జెట్ లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని ఆలోచించారట. దీంతో అప్పుడప్పుడే యువ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న మహేష్ బాబుకు సినిమా కథ పంపించారట. కానీ, రెండు నెలలు అయినా మహేష్ బాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఆ తర్వాత హీరో సుమంత్ ని అనుకున్నారు. కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. సుమంత్ అప్పటికే వరుస సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. మూడవ ప్రత్యన్మాయంగా హిందీ నటుడు ఆఫ్తాబ్ శివదాసానీ పరిశీలించారు. అయితే అతడితో తమ బడ్జెట్ లో సినిమా అయ్యేలా కనిపించలేదు. ఇక చివరిగా కొత్త హీరోతో చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాత రవి కిషోర్. అప్పుడే హీరో తరుణ్ ఫ్రేమ్ లోకి వచ్చాడు. ఒక యాడ్ ప్రకటనలో చూసి తరుణ్ ని ఎంపిక చేశారు. అప్పటికే తరుణ్ కుటుంబం కూడా అతడిని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో రవికిషోర్ తమ సినిమా కథ చెప్పి తరుణ్ ని ఒప్పించారు. అలా ముగ్గురు స్టార్ హీరోలు మిస్ చేసుకున్న 'నువ్వే కావాలి' తరుణ్ కి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా కోసం తరుణ్ రూ. 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట.
Follow Us