Aadhaar Number: ఇకపై దానికి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ పనిచేయదు
ఐటీ రిటర్న్స్ కోసం ఇంతవరకూ ఆధార్ లేకపోయినా దాని ఎన్రోల్మెంట్ నంబర్ ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే అని ప్రభుత్వం చెబుతోంది. 2017 నుంచి అంగీకరిస్తున్న ఎన్రోల్మెంట్ నంబర్ ను ఇకపై అంగీకరించడం కుదరదని ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది.