Mass Jathara Movie Trailer: ఊరమాస్‌ డైలాగ్‌లతో అదిరిపోయిన రవి తేజ మాస్ జాతర ట్రైలర్.. ఫ్యాన్స్‌కు కావాల్సింది ఇదే కదా!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ ఈసారి పక్క హిట్ కొట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది

New Update
Mass Jathara Trailer

Mass Jathara Trailer

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ ఈసారి పక్క హిట్ కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్‌కు కావాల్సినట్లు ట్రైలర్ ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. రవితేజకు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా.. నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే మాస్ జాతర ట్రైలర్ స్టార్టింగ్‌ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చూడండి: Bigg Boss 9 Telugu: నామినేషన్స్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న రీతూ, మాధురి.. హౌస్‌లో రచ్చే రచ్చ!

మాస్ డైలాగ్‌లతో అదిరిపోయిన ట్రైలర్..

నవీన్ చంద్ర వాయిస్‌తో ప్రారంభమై.. రవితేజ మాస్ డైలాగ్‌లతో సూపర్‌గా ఉంది. కొన్ని డైలాగ్‌లు వచ్చేటప్పుడు థియేటర్లలో రచ్చే రచ్చ అని చెప్పవచ్చు. అలాగే రవితేజ, శ్రీలీల మధ్య రొమాన్స్ కూడా బాగా కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీలీలను కొత్త జోనర్‌లో డైరెక్టర్ చూపించినట్లు ట్రైలర్‌లో గమనించవచ్చు. ఇందులో ముఖ్యంగా ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ అయితే ట్రైలర్‌కు బిగ్గెస్ట్ హైలెట్‌గా నిలిచింది. ఇందులో రవితేజ స్టేషన్‌లో పోలీస్ ఆఫీసర్‌ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా రవితేజ నుంచి ఇలాంటి మాస్ డైలాగ్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, రవితేజకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: Jigris Movie release date: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’ మూవీ డేట్ ఫిక్స్.. దోస్త్‌లతో చూస్తే ఆ  మజానే వేరప్పా!

Advertisment
తాజా కథనాలు