/rtv/media/media_files/2025/10/27/jigris-movie-release-date-2025-10-27-19-02-15.jpg)
Jigris Movie release date
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జిగ్రీస్ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఫ్రెండ్‌షిప్, అడ్వెంచర్స్, ఎమోషన్స్‌తో నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో రాబోతుంది. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు అన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పాటను హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేయగా.. టీజర్‌ను డైరెక్టర్ సందీప్ వంగా విడుదల చేశారు. అయితే డైరెక్టర్ హరీష్ రెడ్డి, సందీప్ వంగా రెడ్డి ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు అని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Chiranjeevi Deepfake Video: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ వీడియో క్రియేట్.. కేసు నమోదు!
#Jigris the wild ride begins in theatres worldwide on November 14th !
— Telugu FilmNagar (@telugufilmnagar) October 26, 2025
Pack your madness, the trip of a lifetime is calling.#JigrisOnNov14@KrishnaBurugula@thedheerajkv@ActorManivaka@Ramnitin8@harishuth@krishnawgl@Vinaichittem@syedkamran@me_chanakyart@VaasudevaMc… pic.twitter.com/J1AJvtoKgF
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా..
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రభాస్ పుట్టిన రోజున జిగ్రీస్ మూవీ టీం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. విషెష్ తెలుపుతూ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నాయి. టీజర్ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో మ్యాడ్ హీరో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే తెలంగాణ స్లాంగ్‌లో వచ్చే ఈ టీజర్ అయితే కామెడీ తరహాలో సూపర్‌గా ఉందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Miru miss ayaina mi jigris batch gurutostaru 🥹🥹
— Rajesh_NTR🐉 (@cinemapichodu_9) October 25, 2025
Peak Entertainment loading 🔥🔥 on Nov 14th 🥳 #jigrispic.twitter.com/3TYO6IbOoE
ఇది కూడా చూడండి: Bigg Boss 9 Telugu: నామినేషన్స్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న రీతూ, మాధురి.. హౌస్‌లో రచ్చే రచ్చ!
Follow Us