/rtv/media/media_files/2025/10/27/bigg-boss-telugu-9-2025-10-27-18-22-13.jpg)
Bigg boss Telugu 9
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 8లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చి నామినేషన్ చేసినట్లు.. ఈ సారి కూడా అదే నామినేషన్స్ పెట్టారు. కాకపోతే లాస్ట్ సీజన్‌లో నామినేషన్ రీజన్ చెప్పి బాటిల్ పగలగొట్టాలి. కానీ ఈ సీజన్‌లో కత్తితో పొడవాలి. అయితే ఈ వారం నామినేషన్స్ ఫుల్ రచ్చే రచ్చ అన్నట్లుగా ఉంది. బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలు చూస్తూ ఫైర్ నామినేషన్స్ అంటే ఇదనిపిస్తుంది. తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో రీతూ, మాధురి కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్‌లోకి వచ్చి మాధురికి కత్తి ఇస్తుంది. మీరు ఎవరికి ఎంత బాగా నామినేట్ చేస్తారో? బాండింగ్ అని చెప్పి నామినేట్ చేస్తారా? లేకపోతే ఇంకా ఏ విధంగా నామినేట్ చేస్తారో? అని శ్రజీ చెబుతుంది. అయితే దీంతో మాధురి రీతూని కత్తితో పొడుస్తూ రీతూను నామినేట్ చేస్తుంది.
ఇది కూడా చూడండి: Salman Khan: సల్మాన్ ఖాన్‌ని 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్
The house turns into a battlefield! Nominations war is on! 💣👁️🔥
— Starmaa (@StarMaa) October 27, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9#StreamingNow#StarMaaPromopic.twitter.com/bV6StpAf2v
ఇది కూడా చూడండి: Chiranjeevi Deepfake Video: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ వీడియో క్రియేట్.. కేసు నమోదు!
మీ బాండ్ అన్ హెల్తీ అని..
నువ్వు పవన్‌నే కంటెండర్ చేయాలని అనుకున్నావని మాధురి చెప్పడంతో.. రీతూ గట్టిగా అరుస్తూ నేను కంటెండర్ అయిన తర్వాత నా డబ్బులు ఎవరికైనా ఇస్తానని అంటుంది. దీంతో మాధురి నువ్వు పవన్‌ను సపోర్ట్ చేయడానికి వచ్చావా? గేమ్ ఆడటానికి వచ్చావా? అని అంటుంది. అలా ఇద్దరి మధ్య మాటల వార్ పెరిగింది. ఇంతో రీతూ మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి తనూజకు సపోర్ట్ చేయడానికి వచ్చారా? అని ప్రశ్నిస్తుంది. మీవి మాత్రమే బాండ్స్ హా.. మిగతావారికి బాండ్స్ కాదా? అని అంటే.. మాధురి అరుస్తూ.. మీది అన్‌హెల్తీ బాండ్ అని గట్టిగా రీతూపై అరుస్తుంది. దీంతో రీతూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. అయితే వీరిద్దరూ లైవ్‌లో గట్టిగానే అరుస్తూ కొట్టుకునేంత వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫైర్ నామినేషన్ అని చెప్పవచ్చు.
Follow Us