Nithiin: హిట్ కోసం తహతహలాడుతున్న నితిన్.. 'లిటిల్‌ హార్ట్స్‌' డైరెక్టర్‌తో మూవీ..?

హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ చెప్పిన కొత్త కామెడీ కథపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. కథ నచ్చినా ఇంకా అధికారికంగా ఫైనల్ చేయలేదట. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందించే అవకాశం ఉంది.

New Update
Nithiin

Nithiin

Nithiin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ బిగ్ కం బ్యాక్ కోసం చూస్తున్నారు. గతంలో భీష్మ (2020)తో హిట్ కొట్టిన నితిన్, ఆ తర్వాత చేసిన సినిమాలు రోబిన్‌హుడ్, తమ్ముడు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, మంచి హిట్ కోసం కొత్తగా కథలు వింటున్నారు.

Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

విక్రమ్ కె కుమార్‌తో ప్రాజెక్ట్..?

ఆ మధ్య నితిన్, తన బ్లాక్‌బస్టర్ ఇష్క్ (2012) దర్శకుడు విక్రమ్ కె కుమార్తో మళ్లీ కలిసి పని చేయనున్నారని వార్తలొచ్చాయి. అది ఒక స్పోర్ట్స్ డ్రామా అని, టైటిల్‌ “స్వారీ” అని కూడా టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టేసారు.

లిటిల్‌ హార్ట్స్‌ డైరెక్టర్ కథ వినిపించారా?

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఇటీవలే చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్‌ కొట్టిన "లిటిల్ హార్ట్స్" చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్(Sai Marthand), నితిన్‌ను కలిసి ఒక కొత్త కథ వినిపించారట. ఈ కథ కామెడీ డ్రామా జానర్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ జానర్‌లోనే సాయి మార్తాండ్ ఇప్పటికే సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

సోర్సెస్ చెబుతున్న ప్రకారం, సాయి మార్తాండ్ చెప్పిన కథ నితిన్‌కు బాగా నచ్చిందట. కథ వినగానే నితిన్ ఆసక్తి చూపించారట, అయితే ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. స్క్రిప్ట్ ఫైనల్ అయితే, సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఉండొచ్చని టాక్. వీరు గతంలో లవ్ స్టోరీ, కుబేరా (శేఖర్ కమ్ముల దర్శకత్వం) వంటి సినిమాలు నిర్మించారు. వారి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఈ సినిమా జరగనుంది.

Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్

నితిన్ అభిమానులు ఇప్పుడు మంచి కథతో ఆయన్ని మళ్లీ సక్సెస్‌ఫుల్ హీరోగా చూడాలనే ఆశలో ఉన్నారు. సాయి మార్తాండ్ టాలెంట్, నితిన్ ఎనర్జీ కలిస్తే కామెడీ డ్రామా జోనర్‌లో ఒక సూపర్ హిట్ రావచ్చని అంచనాలు మొదలయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి!

Advertisment
తాజా కథనాలు