/rtv/media/media_files/2024/10/22/63TjNDyAv2wtYZp0m7SS.jpg)
Gangula Kamalakar: బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆయన తల్లి మృతి చెందారు. కాగా కొన్ని నెలలే క్రితమే ఆయన తండ్రి మృతి చెందారు. ఆయన తల్లి మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గంగుల కమలాకర్ కు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే @GangulaBRS గారి మాతృమూర్తి గంగుల నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తన సంతాపం తెలిపారు.
— BRS Party (@BRSparty) October 22, 2024
గంగుల కమలాకర్ గారి కుటుంబానికి తన సానుభూతి తెలిపిన కేటీఆర్, నర్సమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!